Bike: ఈ బైక్ మైలేజ్ కింగ్‌.. ట్యాంక్ ఫుల్ చేస్తే 800 కి.మీలు వెళ్లొచ్చు. ధ‌ర రూ. 65 వేలే

Published : Jan 02, 2026, 12:04 PM IST

Bike: బైక్ కొనుగోలు చేసే ముందు చాలా మంది చూసే అంశాల్లో మైలేజ్ ప్ర‌ధాన‌మైంది. మైలేజ్ ఎక్కువ రావాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆశిస్తుంటారు. మ‌రి త‌క్కువ ధ‌ర‌లో అత్య‌ధిక మైలేజ్ ఇచ్చే ఓ బైక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 

PREV
15
మైలేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చే భారతీయ మార్కెట్

భారతదేశంలో టూవీలర్ కొనుగోలు సమయంలో ధరతో పాటు మైలేజ్ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు రోజూ ఎక్కువ దూరం ప్రయాణం చేస్తారు. ఆఫీస్, వ్యాపారం, వ్యవసాయ పనులు, డెలివరీ ఉద్యోగాలు వంటి అవసరాల కోసం పెట్రోల్ ఖర్చు తక్కువగా ఉండే బైక్‌లనే ఎక్కువగా ఎంచుకుంటారు. అలాంటి అవసరాలకు సరిపోయే బైక్‌లలో బజాజ్ ప్లాటినా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

25
బజాజ్ ప్లాటినా – మైలేజ్ కింగ్‌గా గుర్తింపు

బజాజ్ ప్లాటినా భారత మార్కెట్‌లో ఎన్నో ఏళ్లుగా “మైలేజ్ కింగ్”గా పేరు తెచ్చుకుంది. ఈ బైక్ లీటరుకు సుమారు 70 నుంచి 90 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని వినియోగదారుల అనుభవం చెబుతోంది. తేలికైన బరువు, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ కారణంగా రోజువారీ ప్రయాణాలకు ఇది అనువైన బైక్‌గా నిలిచింది.

35
ప్లాటినా 100, ప్లాటినా 110 – వేరియంట్ల వివరాలు

బజాజ్ సంస్థ ప్రస్తుతం ప్లాటినా సిరీస్‌ను రెండు వేరియంట్లలో అందిస్తోంది.

బజాజ్ ప్లాటినా 100 – ఎంట్రీ లెవెల్ బైక్

బజాజ్ ప్లాటినా 110 డ్రమ్ – కొంచెం ఎక్కువ పవర్ కోరుకునే వారికి

ప్లాటినా 100 ఎక్స్ షోరూమ్ ధర రూ.65,407గా ఉంది. ప్లాటినా 110 డ్రమ్ ధర రూ.69,284గా నిర్ణయించారు. తక్కువ బడ్జెట్‌లో మంచి బైక్ కావాలనుకునే వారికి ప్లాటినా 100 సరైన ఎంపికగా మారింది.

45
ఇంజిన్ సామర్థ్యం, పనితీరు

ప్లాటినా 100లో 102 సీసీ, 4-స్ట్రోక్, సింగిల్ సిలిండర్ DTS-i ఇంజిన్ ఉంది. బజాజ్ రూపొందించిన ఈ ఇంజిన్ తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందించారు. అందుకే ఈ బైక్ ఆఫీస్ ఉద్యోగులు, ఫుడ్ డెలివరీ రైడర్స్, రాపిడో రైడర్స్, రైతులకు ఉపయోగకరంగా మారింది.

ప్లాటినా 110 వేరియంట్‌లో 115.45 సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అందిస్తున్నారు. ఈ టెక్నాలజీ వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ మెరుగవుతుంది. ఎత్తైన ప్రాంతాల్లో ప్రయాణించినా ఇంజిన్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

55
ఫ్యూయల్ ట్యాంక్ రేంజ్

ఈ బైక్ 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేయిస్తే దాదాపు 700 నుంచి 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. తరచూ పెట్రోల్ బంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం పెద్ద ప్లస్ పాయింట్. సింపుల్ మెయింటెనెన్స్, తక్కువ సర్వీస్ ఖర్చుతో ప్లాటినా మధ్యతరగతి కుటుంబాలకు నమ్మకమైన బైక్‌గా నిలిచింది.

Read more Photos on
click me!

Recommended Stories