Bike Repair Tips : బైక్ స్టార్ట్ కావడం లేదా? మెకానిక్ అక్కర్లేదు.. ఇలా చేయండి !

Published : Dec 28, 2025, 06:58 PM ISTUpdated : Dec 28, 2025, 07:07 PM IST

Bike Repair Tips : చలికాలంలో బైక్ స్టార్ట్ కావడం లేదా? మెకానిక్ అవసరం లేకుండానే ఈ 6 సింపుల్ చిట్కాలతో సమస్యను పరిష్కరించవచ్చు. ఇలా చేస్తే మీ సమయం, డబ్బు ఆదా అవుతాయి. ఆ వివరాలు మీకోసం. 

PREV
16
బైక్ కిక్ రాడ్, సెల్ఫ్ పని చేయడం లేదా? అయితే ఇది మీ కోసమే!

ద్విచక్ర వాహనదారులకు తరచుగా ఎదురయ్యే ప్రధాన సమస్య బైక్ స్టార్ట్ కాకపోవడం. మనం ఆఫీసుకో లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లాలనుకున్నప్పుడు బైక్ స్టార్ట్ కాకపోతే వచ్చే చిరాకు అంతా ఇంతా కాదు. బైక్ స్టార్ట్ చేయడానికి పదే పదే కిక్ రాడ్ కొట్టడం లేదా సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కుతూ ఉండటం మనం తరచుగా చూస్తుంటాం. అయినప్పటికీ బైక్ ఏమాత్రం స్టార్ట్ కాని పరిస్థితులు కనిపిస్తుంటాయి.

ముఖ్యంగా ప్రస్తుతం కొనసాగుతున్న చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే బైక్ స్టార్ట్ కాలేదంటే ప్రతిసారీ ఏదో పెద్ద సాంకేతిక లోపం ఉందని భావించాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో మనకు తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లు లేదా సాధారణ కారణాల వల్లనే బైక్ మొరాయిస్తుంది. ఇలాంటి వాటిని మనం సులభంగా గుర్తించి, మనమే స్వయంగా సరిచేసుకోవచ్చు. దీనికోసం మెకానిక్ వద్దకు వెళ్లాల్సిన పనిలేదు.

మీ బైక్ స్టార్ట్ కానప్పుడు మెకానిక్ వద్దకు వెళ్లే ముందు, తప్పనిసరిగా చెక్ చేయాల్సిన 6 ముఖ్యమైన అంశాలు గమనిస్తే..

26
ఇంజిన్ కిల్ స్విచ్ పొజిషన్

బైక్ స్టార్ట్ కానప్పుడు కంగారు పడే ముందు మొదటగా చూడాల్సినది ఇంజిన్ కిల్ స్విచ్. సాధారణంగా బైక్ హ్యాండిల్ కు కుడివైపున ఎరుపు రంగులో ఈ ఇంజిన్ కట్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద లేదా పార్కింగ్ చేసేటప్పుడు చాలామంది బైక్ ఆఫ్ చేయడానికి ఈ స్విచ్ ను ఉపయోగిస్తుంటారు.

ఆ తర్వాత తిరిగి బైక్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ స్విచ్ ను ఆన్ పొజిషన్ లోకి మార్చడం మర్చిపోతుంటారు. ఇలాంటి సమయంలో మీ బైక్ ఎంత కొత్తదైనా సరే స్టార్ట్ కాదు. ఇది చాలా చిన్న విషయమే అయినా, చాలామంది దీనిని గమనించక ఆందోళన చెందుతుంటారు. కాబట్టి బైక్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి కిల్ స్విచ్ ఆన్ లో ఉందో లేదో చూడండి.

36
స్పార్క్ ప్లగ్ వైర్ చెకింగ్

ఇంజిన్ పనితీరులో స్పార్క్ ప్లగ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇంజిన్ లో ఇంధనం మండటానికి అవసరమైన స్పార్క్ ను పుట్టించేది ఇదే. ఒకవేళ స్పార్క్ ప్లగ్ కు ఉండే వైర్ వదులుగా ఉన్నా లేదా ప్లగ్ పై దుమ్ము, ధూళి పేరుకుపోయినా ఇంజిన్ కు సరైన సిగ్నల్ అందదు. ఫలితంగా బైక్ స్టార్ట్ కాదు.

దీనిని సరిచేయడానికి స్పార్క్ ప్లగ్ ను బయటకు తీయాలి. ఒక పొడి, శుభ్రమైన గుడ్డతో దానిని బాగా తుడవాలి. ఆ తర్వాత వైర్ ను గట్టిగా బిగించి తిరిగి అమర్చాలి. అనంతరం బైక్ స్టార్ట్ చేసి చూడాలి. చాలా సందర్భాల్లో ఈ చిన్న మార్పుతో పెద్ద సమస్య తీరిపోతుంది.

46
బ్యాటరీ, సెల్ఫ్ స్టార్ట్ సమస్యలు

చలికాలంలో వాహనాల బ్యాటరీలు త్వరగా బలహీనపడటం సహజమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రోజుల పాటు బైక్ ను వాడకుండా పక్కన పెడితే బ్యాటరీ డౌన్ అవుతుంది. మీరు సెల్ఫ్ స్టార్ట్ బటన్ నొక్కినప్పుడు బైక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోతే, బ్యాటరీ డౌన్ అయ్యిందని అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి పరిస్థితుల్లో బైక్ ను మెయిన్ స్టాండ్ పై ఉంచాలి. గేర్ ను నాలుగవ గేర్ లో వేయాలి. ఇప్పుడు వెనుక చక్రాన్ని చేతితో వేగంగా తిప్పాలి. దీనిని సాధారణ భాషలో పుష్ స్టార్ట్ పద్ధతి అని కూడా అంటారు. ఇలా చేయడం వల్ల ఇంజిన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి

కొన్నిసార్లు మనం గమనించకుండానే బైక్ లో పెట్రోల్ అయిపోతుంది. ఇంధనం లేకుండా ఇంజిన్ నడవడం అసాధ్యం. అయితే చాలామంది కేవలం ఫ్యూయల్ గేజ్ లేదా మీటర్ ను మాత్రమే నమ్ముతారు. కొన్నిసార్లు టెక్నికల్ లోపం వల్ల మీటర్ లో పెట్రోల్ ఉన్నట్టు చూపించినా, ట్యాంక్ ఖాళీగా ఉండవచ్చు.

అందుకే బైక్ అకస్మాత్తుగా ఆగిపోయినా లేదా స్టార్ట్ కాకపోయినా ట్యాంక్ మూత తెరిచి పెట్రోల్ ఉందో లేదో భౌతికంగా చెక్ చేసుకోవడం మంచిది. మనం అనుకునేంత పెద్ద సమస్య కాకుండా, కేవలం పెట్రోల్ లేకపోవడమే కారణం కావచ్చు.

56
క్లచ్, గేర్ పొజిషన్

బైక్ గేర్ లో ఉన్నప్పుడు క్లచ్ లివర్ ను సరిగ్గా నొక్కకపోతే బండి స్టార్ట్ కాదు. కొన్నిసార్లు క్లచ్ సరిగ్గా డిస్ ఎంగేజ్ కాకపోవడం వల్ల స్టార్టింగ్ లో ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈ సమస్యను అధిగమించడానికి బైక్ ను ఎప్పుడూ న్యూట్రల్ గేర్ లో ఉంచి స్టార్ట్ చేయడం బెటర్. ఒకవేళ గేర్ లో ఉంటే, క్లచ్ లివర్ ను పూర్తిగా నొక్కి పట్టి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేస్తే స్టార్టింగ్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.

66
ఎయిర్ ఫిల్టర్ శుభ్రత

ఇంజిన్ కు స్వచ్ఛమైన గాలిని ఎయిర్ ఫిల్టర్ అందిస్తుంది. ఒకవేళ ఫిల్టర్ లో దుమ్ము, ధూళి పేరుకుపోయి జామ్ అయితే, ఇంజిన్ కు తగినంత గాలి అందదు. దీనివల్ల బైక్ స్టార్ట్ కాకపోవడమే కాకుండా, నడుస్తున్నప్పుడు కుదుపులకు లోనవుతుంది.

మీకు ఇలాంటి సమస్య అనిపిస్తే వెంటనే ఎయిర్ ఫిల్టర్ ను చెక్ చేయండి. అవసరమైతే దానిని శుభ్రం చేయాలి లేదా కొత్తది మార్పించుకోవాలి. ఇది బైక్ స్టార్టింగ్ సమస్యనే కాకుండా, మైలేజ్, పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories