ఈ యోగ గురువు నడిపే కారు ధర వింటే మీరు షాక్ అవుతారు.. ఈ కారు అంత ప్రత్యేకమా?!!

First Published | Sep 2, 2023, 1:17 PM IST

సద్గురు తాజాగా నడిపిన ల్యాండ్ రోవర్ డిఫెండర్ లగ్జరీ ఎస్‌యూవీ విలువ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతోంది.

ఈ యోగ గురువుని జగ్గీ వాసుదేవ్, సద్గురు అని కూడా పిలుస్తారు, అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ ఆధ్యాత్మికుల లీడర్స్ లో ఒకరు. అయినప్పటికీ చాలా మంది ఆధ్యాత్మిక లీడర్స్ లా కాకుండా, తన భిన్నమైన లైఫ్ స్టయిల్ కి పాపులర్. ఇతని లైఫ్ స్టయిల్ ఫాలోవర్స్  దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తుంది.

ఆటోమొబైల్ పట్ల అతని అభిరుచి అతని లైఫ్ స్టయిల్ కి ముఖ్యమైంది. అతను తరచుగా వివిధ సందర్భాలలో బైక్స్  నడపడం లేదా కార్లు నడపడం చూస్తుంటాం. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియోల  సద్గురు రూ. 2.5 కోట్ల విలువైన కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 లగ్జరీ SUVని నడుపుతున్నట్లు చూడవచ్చు.


సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో సద్గురు ల్యాండ్ రోవర్ డిఫెండర్ డ్రైవింగ్ చేస్తూ పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నట్లు చూపిస్తుంది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రపంచంలోని అత్యుత్తమ ఆఫ్-రోడర్ SUVలలో ఒకటి. ముఖ్యంగా ఈ కారు అర్జున్ కపూర్, ప్రకాష్‌రాజ్, ఆయుష్ శర్మ, సన్నీ డియోల్, సునీల్ శెట్టి ఇంకా సంజయ్ దత్‌లతో సహా చాలా మంది ప్రముఖుల గ్యారేజీలో ఉంది.

వీడియో ఆధారంగా, సద్గురు ల్యాండ్ రోవర్ డిఫెండర్  కార్పాతియన్ గ్రే పెయింట్ స్కీమ్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. గ్రే కాకుండా ఈ SUV శాంటోరిని బ్లాక్ మెటాలిక్, టాస్మాన్ బ్లూ మెటాలిక్, గోండ్వానా స్టోన్ మెటాలిక్, ఈగర్ గ్రే మెటాలిక్, ఫుజి వైట్, యులాంగ్ వైట్, సిలికాన్ సిల్వర్, హకుబా సిల్వర్ ఇంకా  లాండౌ బ్రాంజ్ వంటి కలర్స్ లో అందుబాటులో ఉంది.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ ప్రపంచవ్యాప్తంగా మూడు ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. ఇవి డిఫెండర్ 130, డిఫెండర్ 110 ఇంకా డిఫెండర్ 90. వీటిలో  సద్గురు డిఫెండర్ 110ని నడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. డిఫెండర్ 90 అనేది   3-డోర్ కారు మోడల్.

సద్గురు నడిపే మోడల్ 5.0-లీటర్ సూపర్ఛార్జ్డ్ V8 ఇంజన్‌తో వస్తుంది, ఈ కార్ గరిష్టంగా 525 PS శక్తిని, 625 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా  కేవలం 5.4 సెకన్లలో 0 నుండి 100 kmph స్పీడ్ అందుకుంటుంది అలాగే  టాప్ స్పీడ్  240 kmph. దీనికి  8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అండ్ 3.5-టన్నుల టోయింగ్ కెపాసిటీ  ఉంది.

Latest Videos

click me!