కొత్త ఆల్టో కె10 స్టార్ట్/స్టాప్ టెక్నాలజీతో కూడిన 1.0లీ డ్యూయల్‌జెట్, డ్యూయల్ వివిటి కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది. ఈ మోటార్ 67 బిహెచ్‌పి పవర్, 89 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొనేవారు 5-స్పీడ్ మాన్యువల్ అండ్ AMT గేర్‌బాక్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కొత్త Alto K10 మైలేజ్ గణాంకాలు 24.90kmpl (AMT) అండ్ 24.39kmpl (MT). సుజుకి హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, కొత్త మారుతి ఆల్టో కె10లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రీ-టెన్షనర్, ఫోర్స్ లిమిటర్ ఫ్రంట్ సీట్ బెల్ట్‌లు, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, హై స్పీడ్ అలర్ట్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఇబిడి), యాంటీ- లాక్ అంటే బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ను కూడా పొందుతుంది.