కేవలం రూ.100తో 700 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.. ఎలా అనుకుంటున్నారా.. దీని ధర ఎంత అంటే ?

First Published Sep 26, 2023, 12:18 PM IST

హోప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేసే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ Hope Electric ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లో  కంపెనీ స్కూటర్లను లాంచ్  చేసింది. దీని ధర, మైలేజీ, ప్రత్యేక ఫీచర్లు ప్రజలను ఆకర్షించేలా రూపొందించారు.
 

మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే  మీకో  శుభవార్త. కేవలం రూ.100తో 700 కిలోమీటర్లు వెళ్లవచ్చని కంపెనీ పేర్కొంది. హోప్ ఎలక్ట్రిక్ అనేది ఒక ఎలక్ట్రిక్ వెహికిల్ (EV) కంపెనీ. ఈ కంపెనీ  మార్కెట్లో వివిధ మోడళ్లను విక్రయిస్తుంది. వీటిలో హోప్ లియో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి.
 

అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం... దీనిలో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇంకా  2200 వాట్ల మోటారును కంపెనీ అమర్చింది. దీని టార్క్ 90 ఎన్ఎమ్. ఇంకా టాప్ స్పీడ్  గంటకు 52 కిలోమీటర్లు. లోడ్ సామర్థ్యం 180 కిలోలు. ఇందులో 72V BLDC హబ్ మోటార్ ఉంది. దీనికి IP66 రేటింగ్ కూడా  లభించింది. అంటే వర్షంలో కూడా రైడ్ చేయవచ్చు.
 

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. దీనికి 15 amp పవర్ సాకెట్ ఉంది. దాదాపు 4 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఈ స్కూటర్  రెండు బ్యాటరీ అప్షన్స్ లో  వస్తుంది. 20Ah  ఒకటి. 29Ah మరొకటి. 20 Ah బ్యాటరీ వేరియంట్ 90 కి.మీ పరిధిని అందిస్తుంది. అలాగే  29 AH వేరియంట్ 120 కి.మీ అందిస్తుంది.
 

ఇంకా స్కూటర్ పై  మూడు సంవత్సరాల వరకు వారంటీని అందిస్తుంది. దీని రన్నింగ్ అండ్ సర్వీసింగ్ ఖర్చులు కూడా చాలా తక్కువగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. అలాగే ఈ స్కూటర్ లేటెస్ట్  ఫీచర్లతో వస్తుంది. హోప్ లియో స్కూటర్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ఎలక్ట్రానిక్ అసిస్టెడ్ బ్రేకింగ్ సిస్టమ్, యాంటీ-థెఫ్ట్ వీల్ లాక్ అలారం మొదలైన వాటితో వస్తుంది.
 

రిమోట్ కీలెస్ ఇగ్నిషన్, GPS, GSM కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. లియో హెచ్ఎస్ వేరియంట్ ధర రూ. 97,504.  లియో ఎల్ఎస్ స్కూటర్ ధర రూ. 84,360. ఈ స్కూటర్లు వైట్, గ్రే, రెడ్, బ్లాక్ అండ్  బ్లు కలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్కూటర్లను రూ.4,100 వరకు డిస్కౌంట్ తో అందిస్తున్నారు. 

అయితే పెట్రోల్ స్కూటర్‌లు రూ. 100కి కేవలం 60- 70 కి.మీలు ప్రయాణిస్తాయని, అదే మొత్తానికి హోప్ EV స్కూటర్లు 700 కి.మీలు ప్రయాణించగలవని కంపెనీ   వెబ్‌సైట్‌లో పేర్కొంది.

click me!