ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. కేవలం రూ.55 వేలు మాత్రమే.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు..

First Published Sep 25, 2023, 3:15 PM IST

 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్. మార్కెట్లోకి నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు (EV) ఎంట్రీ ఇచ్చాయి. వీటన్నిటికీ ఒకే విధమైన ఫీచర్స్  ఉంటాయి ఇంకా ధర  కూడా మీ బడ్జెట్ లోనే. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు ఏంటి ? వీటి ధర ఎంత?  ఇలాంటి సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం... 
 

బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

డైనమో ఎలక్ట్రిక్ నాలుగు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసింది. ఆల్ఫా, స్మైలీ, ఇన్ఫినిక్స్, VX1, RX1, RX4 లాంచ్ చేయబడ్డాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్‌లో జరిగిన EV ఇండియా ఎక్స్‌పో 2023లో కంపెనీ ఇప్పటికే ఈ హై-స్పీడ్ అండ్ లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రదర్శించింది.

డైనమో RX1 మోడల్ లో 2KW బ్యాటరీ ఉంది. ఈ స్కూటర్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్. దీని ధర రూ. 82 వేలు. డైనమో RX4 స్కూటర్ లో 3KW బ్యాటరీ ఉంది. దీని ధర రూ.99 వేలు. ఈ రెండు స్కూటర్ల టాప్ స్పీడ్  గంటకు 65 కి.మీ. బ్లూటూత్ స్పీకర్లు, USB ఛార్జింగ్ పోర్ట్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లు ఉన్నాయి.
 

డైనమో ఆల్ఫా, స్మైలీ, ఇన్ఫినిటీ, VX1 తక్కువ  స్పీడ్ తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్లు. వీటి పరిధి 200 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇవి 2KW అండ్ 3KW బ్యాటరీ అప్షన్స్ లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 55 వేల నుంచి ప్రారంభమవుతుంది. కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కంపెనీ ఆథరైజేడ్  డీలర్‌షిప్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. 3 నుంచి 4 గంటల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అవుతుందని తెలుసుకోవాలి.
 

click me!