మీ జీతం డబ్బుతో కారు కొనాలనుకుంటున్నారా... అయితే ఎంతకు కొనాలి, ఎలా కొనాలి..? ఇదిగో ఒక ఫార్ములా !

మీలో చాల మందికి  కొత్త కారు కొనడం దాదాపు అందరి ఉండే కల. కానీ ఈ పెరుగుతున్న ధరలు, ప్రతి రోజు ఉండే  ఖర్చులు, అవసరాల నేపథ్యంలో  కొనడం అంత సులభం కాదు. కొత్త కారు కొనాలంటే చాలా డబ్బు అవసరం. కొత్త కారు కొనడానికి  అందరి దగ్గర తగినంత డబ్బు ఉండదు.  

How much should you buy a car based on your salary? Here's a formula!-sak

కొత్త కారు కోసం ఇలా బడ్జెట్‌  రూపొందించండి
మీరు కొత్త కారును కొనాలనుకుంటే, దాని బడ్జెట్‌ను నిర్ణయించలేకపోతే మీరు ఒక ఫార్ములాను అనుసరించాలి. కారుకే కాదు దేనికైనా డబ్బు అడ్జస్ట్ చేయడం చాలా ముఖ్యం. ఈ ఫార్ములా ప్రకారం, మీరు మీ సంవత్సర  ఆదాయంలో సగం కంటే ఎక్కువ కొత్త కారు కోసం ఖర్చు చేయకూడదు. 

How much should you buy a car based on your salary? Here's a formula!-sak

దీన్ని మనం ఒక ఉదాహరణతో సులభంగా అర్థం చేసుకోవచ్చు. మీ సంవత్సర  ఆదాయం రూ.15 లక్షలు అనుకుందాం, అప్పుడు మీరు కారుపై రూ.7.5 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు, మీ సంవత్సర  ఆదాయం రూ.20 లక్షలు అయితే మీరు రూ.10 లక్షల కంటే తక్కువ ఖర్చు చేయాలి. మీరు మీ కారు కోసం ఆదాయం మించి ఎక్కువ ఖర్చు చేయకూడదు. అదేవిధంగా, మీరు మీ సంవత్సర  ఆదాయం ఆధారంగా మీ కారు బడ్జెట్‌ను నిర్ణయించుకోవచ్చు. కారు ఎక్స్-షోరూమ్ ధర ఆధారంగా మాత్రమే కాకుండా ప్రస్తుత ధరపై (on 
 road  price)కూడా అంచనా వేయాలి. 


20/4/10 ఫార్ములా
కారు  కోసం మీరు 20/4/10 సూత్రాన్ని అనుసరించాలి. అంటే కారు కొనుగోలు చేసేటప్పుడు కనీసం 20 శాతం డౌన్ పేమెంట్ చెల్లించాలి. అలాగే, నాలుగు సంవత్సరాలకు మించి లోన్  వ్యవధి ఉండకుండా నిర్ణయించుకోవాలి. అలాగే మీ కార్  EMI మీ ప్రతినెలా ఆదాయంలో 10 శాతానికి మించకూడదని గుర్తుంచుకోండి.

Latest Videos

vuukle one pixel image
click me!