Petrol Tank: వర్షాకాలంలో కారు ట్యాంక్ ఖాళీగా ఉంచుతున్నారా? అసలు ఎంత పెట్రోల్ ఉండాలి?

Published : Jul 13, 2026, 03:54 PM IST

Petrol Tank: వర్షాకాలంలో కార్లైనా, ఏ వెహికల్స్ అయినా చాలా జాగ్రత్తగా వాడాలి. లేకపోతే పాడయ్యే ప్రమాదం ఉంది. ముందుగా కారు ఫ్యూయెల్ ట్యాంక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అసలు వర్షాకాలంలో కారు ట్యాంక్‌లో ఎంత ఇంధనం ఉండాలో తెలుసా?

PREV
13
వర్షాకాలంలో ఖాళీ ఫ్యూయల్ ట్యాంక్ వల్ల ఇంజిన్‌కు పెద్ద ప్రమాదం

వర్షాకాలంలో కార్లైనా, ఏ వెహికల్స్ అయినా చాలా జాగ్రత్తగా వాడాలి. లేకపోతే పాడయ్యే ప్రమాదం ఉంది. ముందుగా కారు ఫ్యూయెల్ ట్యాంక్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అసలు వర్షాకాలంలో కారు ట్యాంక్‌లో ఎంత ఇంధనం ఉండాలో తెలుసా? వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. కారు ట్యాంక్ ఖాళీగా ఉంటే, ఆ ఖాళీ ప్రదేశంలో తేమతో కూడిన గాలి చేరి నీరుగా మారుతుంది. ఇది ఇంజిన్‌ను పాడు చేస్తుంది.

23
పెట్రోల్‌లో నీరు కలిస్తే కలిగే నష్టాలు: ఇంజిన్ మిస్‌ఫైర్, తుప్పు పట్టడం

ఇంధనంలో నీరు కలిస్తే ఇంజిన్ మిస్‌ఫైర్ అవుతుంది, ట్యాంక్ లోపల తుప్పు పడుతుంది, ఫ్యూయల్ పంప్ పాడవుతుంది. దీనివల్ల వేలల్లో ఖర్చు తప్పదు. రాత్రిపూట వాతావరణం చల్లబడినప్పుడు, ట్యాంక్‌లోని గాలిలో ఉన్న తేమ నీటి బిందువులుగా మారుతుంది. ఈ ప్రక్రియను కండెన్సేషన్ అంటారు. ఇది పెట్రోల్‌లో కలిసిపోతుంది.

33
ఫ్యూయల్ పంప్ భద్రతకు ముఖ్యమైన చిట్కా

ట్యాంక్ నిండుగా ఉంచడం వల్ల ఫ్యూయల్ పంప్ ఫ్యూయెల్‍లో మునిగి ఉండి చల్లగా ఉంటుంది. దీనివల్ల దాని జీవితకాలం పెరుగుతుంది, మధ్యలో బండి ఆగిపోయే సమస్యలు రావు. వర్షాకాలంలో మీ కారు ట్యాంక్‌ను ఎల్లప్పుడూ సగం కంటే ఎక్కువగా, వీలైతే 75% నిండుగా ఉంచండి. ఇది నీరు చేరే ప్రమాదాన్ని, అనవసర ఖర్చులను తగ్గిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories