టాటా ఆల్ట్రోజ్ రేసర్
టాటా మోటార్స్ నుండి పాపులర్ ఆల్ట్రోజ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ అధిక-పనితీరు గల వేరియంట్ అయిన ఆల్ట్రోజ్ రేసర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. టాటా ఆల్ట్రోజ్ రేసర్ 120 బిహెచ్‌పి పవర్, 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే భారీ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది. దీని మెరుగైన పనితీరు సామర్థ్యాలను కవర్ చేస్తూ, ఆల్ట్రోజ్ రేసర్ బోల్డ్ గ్రాఫిక్స్ ఇంకా స్పోర్టీ బకెట్ సీట్లతో సహా ప్రత్యేకమైన సౌకర్యాలతో వస్తుంది.
మహీంద్రా XUV300 ఫేస్‌లిఫ్ట్
కాంపాక్ట్ SUV విభాగంలో మహీంద్రా ఈ సంవత్సరం ఫేస్‌లిఫ్టెడ్ XUV300ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కారు గొప్ప డిజైన్ మార్పులతో ఉంటుందని భావిస్తున్నారు. XUV300 ఫేస్‌లిఫ్ట్‌లో అప్‌డేట్ LED హెడ్‌లైట్లు, రీడిజైన్ గ్రిల్ అండ్ అప్‌డేట్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్‌ను అందించే మొదటి కార్ అవుతుంది.
మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్
మారుతి సుజుకి అత్యంత ప్రజాదరణ పొందిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ కారు చాలా మంది ఎదురుచూస్తున్న నాల్గవ జనరేషన్ స్విఫ్ట్. స్లీక్ డిజైన్, అత్యాధునిక టెక్నాలజీ, మెరుగైన పనితీరుతో వస్తుందని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
దీనిని తాజాగా జపాన్‌లో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ వేరియంట్‌తో పరిచయం చేసారు. ఫేస్‌లిఫ్టెడ్ స్విఫ్ట్ 82 బిహెచ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే కొత్త 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. మంచి ఇంధన సామర్థ్యం కోసం సెల్ఫ్-ఛార్జింగ్ 12V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది. అదనంగా, కొత్త స్విఫ్ట్‌లో భద్రత కోసం అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అమర్చబడి ఉంటుంది.
స్కోడా సూపర్బ్
స్కోడా ఫ్లాగ్‌షిప్ సెడాన్ సూపర్బ్‌ను భారత మార్కెట్లో తిరిగి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ కారు ఏప్రిల్ 3న లాంచ్ కానుంది. కొత్త సూపర్బ్ పవర్ ఫుల్ 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 189 bhp శక్తిని, 320 Nm టార్క్‌ను అందిస్తుంది. అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ టెక్నాలజీ, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్‌తో కూడిన సూపర్బ్ స్కోడా బ్రాండ్‌కు మరోపేరుగా ఉండే అధునాతన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఈ సెడాన్ భారత మార్కెట్ నుండి తాత్కాలికంగా నిలిపివేయబడినప్పటికీ, తక్కువ ధరతో పూర్తిగా నిర్మించబడిన యూనిట్ (CBU) ద్వారా తిరిగి రావాలని భావిస్తున్నారు.
టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్
మారుతి సుజుకి ఫ్రాంక్స్ నుండి ప్రేరణ పొందిన చిన్న SUV అయిన అర్బన్ క్రూయిజర్ అనేది టయోటా మోటార్స్ నుండి చాలా మంది ఎదురుచూస్తున్న లాంచ్లలో ఒకటి. దీనిని ఏప్రిల్ 3న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దీని గ్రిల్, బంపర్ అండ్ అల్లాయ్ వీల్స్ వంటివి ప్రత్యేక మార్పులతో ఉంటుంది. ఈ కారు 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ అండ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అప్షన్స్ ఉంటాయి. ఇందులో హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉంటుంది.