నీతా అంబానీ 100 కోట్ల కారు.. వావ్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

First Published | Mar 30, 2024, 7:40 PM IST

రిలయన్స్ ట్రస్ట్,   ధీరుబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకులు  అండ్ చైర్మన్ అయిన నీతా అంబానీ గురించి తెలియని వారు ఉండరు.
 

ఇండియన్ బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ నికర విలువ 116.1 బిలియన్లకు పైగా ఉంటుందని అంచనా. అయితే  భారతదేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో నీతా అంబానీ ఒకరిగా గుర్తింపు పొందారంటే అతిశయోక్తి కాదు. మొదట్లో ఆమె 800 రూపాయల జీతంతో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన వ్యక్తి  కావడం గమనార్హం.
 

అరుదైన కళాఖండాలు, ప్రత్యేకమైన నగలు, విలాసవంతమైన కార్ల కలెక్షన్  ఆమె  అభిరుచి ఆమెలోని  కళాత్మక ప్రతిభను బహిర్గతం చేస్తుందని చెప్పవచ్చు. అందులో ఆమె దగ్గర  ఉన్న ప్రత్యేకమైన కార్లలో ఆడి A9 కాంలియన్(Audi A9 Chameleon) ఒకటి. 

జస్ట్ ఒక బటన్‌ నొక్కడం ద్వారా కార్ ఓనర్ ఈ కార్  కలర్  మార్చడానికి ఆక్సెస్ ఇస్తుంది. ముఖ్యంగా, ఈ కారు ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ పెయింట్ సిస్టమ్‌కు పాపులర్ చెందింది. నీతా అంబానీకి చెందిన అనేక లగ్జరీ కార్లలో ఇదొకటి అని మనం తెలుసుకోవాలి. 
 


స్పానిష్ డిజైనర్ డేనియల్ గార్సీ రూపొందించిన ఈ లిమిటెడ్ ఎడిషన్ కార్  4.0-లీటర్ V8 ఇంజన్‌తో వస్తుంది, దాదాపు 600 హార్స్‌పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది నీతా అంబానీ కలెక్షన్లలో  ఒక ప్రత్యేకమైన కారు. ఇండియన్ మార్కెట్లో దీని విలువ దాదాపు రూ.100 కోట్లు. నీతా అంబానీకి ఈ కారు కాకూండా  చాలా ఖరీదైన ఇతర కార్లు కూడా ఉన్నాయి. 
 

నీతా అంబానీ వార్డ్‌రోబ్ కూడా ఆమె టెస్ట్  గురించి చెబుతుంది. ఆమె సేకరణలో చెన్నై సిల్క్స్ డైరెక్టర్ శివలింగం రూపొందించిన చీర ఉంది, దీని ధర దాదాపు రూ. 40 లక్షలు. వజ్రాలు, బంగారం, ముత్యాలు అండ్  ఇతర అరుదైన ఆభరణాలతో అలంకరించబడిన ఈ చీర ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీర.
 

Latest Videos

click me!