వావ్.. సరికొత్త లేటెస్ట్ ఫీచర్లతో టీవీఎస్ పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు..

First Published | Jul 20, 2021, 3:52 PM IST

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఈ రంగంలో కొత్త  వాహనాలను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టివిఎస్ మోటార్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ క్రియాన్‌ను త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. 

ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ క్రియాన్ కాన్సెప్ట్ ఆధారంగా ఉంటుందని కంపెనీ సూచించింది. ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇ-స్కూటర్‌లో కొత్త అధునాతన టెక్నాలజీ, కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.
1,000 కోట్ల పెట్టుబడిటీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి రూ .1,000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. టీవీఎస్ క్రియాన్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోసూర్ ప్లాంట్లో తయారు చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ప్రారంభించబడటానికి ముందే కంపెనీకి 500 మందికి పైగా ఇంజనీర్లు చివరి లుక్, ఆకారం ఇవ్వడంలో పాల్గొన్నారు. టీవీఎస్ మొట్టమొదట 2018 ఆటో ఎక్స్‌పోలో క్రియాన్ కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరిచయం చేసింది.

అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, టాప్ స్పీడ్ అండ్ రేంజ్ టీవీఎస్ క్రియోన్‌లో అందించారు. ఈ బ్యాటరీ 12 కిలోవాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీంతోకేవలం 5.1 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని టివిఎస్ పేర్కొంది.
బ్యాటరీ అండ్ ఛార్జింగ్ఈ స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టంతో వస్తుంది, తద్వారా బ్యాటరీ తక్కువ సమయంలో ఛార్జ్ అవుతుంది ఇంకా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఇవి కాన్సెప్ట్ మోడల్ నుండి వచ్చిన గణాంకాల ప్రకారం ఫాస్ట్ ఛార్జింగ్ అవుట్‌లెట్ల ద్వారా కేవలం 1 గంటలో దీని బ్యాటరీని 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ప్రొడక్షన్ వెర్షన్‌లో ఈ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో అప్పుడు డ్రైవింగ్ రేంజ్ చూడవచ్చు.
అడ్వాన్స్ ఫీచర్స్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో స్మార్ట్ ఫోన్ ఛార్జర్, టిఎఫ్‌టి స్క్రీన్, పార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. అంతేకాకుండా రైడింగ్ మోడ్లు, జియోఫెన్సింగ్, యాంటీ-తెఫ్ట్ సిస్టమ్ వంటి ఫీచర్స్ కూడా పొందే అవకాశం ఉంది.
లాంచింగ్ అండ్ సేల్స్టివిఎస్ క్రియాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంస్థ ప్రస్తుత ఎలక్ట్రిక్ మోడల్ టివిఎస్ ఐక్యూబ్ కంటే కొంచెం పైన ఉండే అవకాశం ఉంది. ఇందులో అధునాతన ఫీచర్స్ పొందే అవకాశం ఉంది అందువల్ల దీనికి ఐక్యూబ్ కంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. మీడియా నివేదికల ప్రకారం, వచ్చే ఏడాది నాటికి కంపెనీ టీవీఎస్ క్రియోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయవచ్చు.సంస్థ ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని బెంగళూరు, ఢీల్లీ, పూణే, చెన్నై, కోయంబత్తూర్ వంటి ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే విక్రయిస్తుంది. అయితే, టీవీఎస్ ఎలక్ట్రిక్ వాహనాలను దేశంలోని మరిన్ని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లాలని యోచిస్తోంది.

Latest Videos

click me!