తాజాగా సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగులను ప్రారంభిస్తున్నట్లు ఓలా ప్రకటించింది. దీంతో కంపెనీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ అతి త్వరలో ఇండియన్ రోడ్స్ పైకి రాబోతున్నట్లు స్పష్టం చేసింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ ధరను కేవలం రూ.499 ఉంచారు. ఈ మొత్తం పూర్తిగా తిరిగి చెల్లించబడుతుందని కంపెనీ తెలిపింది. అంటే, కస్టమర్ ఒకవేళ బుకింగ్‌ను రద్దు చేయాలనుకుంటే, అతని మొత్తం డబ్బు తిరిగి చెల్లిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకు ఆసక్తిగల కొనుగోలుదారులు మొదట వెబ్‌సైట్‌లో ఒక ఖాతాను సృష్టించుకోవాలి, తరువాత స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు, మొదట బుక్ చేసుకునే వినియోగదారులకు స్కూటర్ డెలివరీలో ప్రాధాన్యత ఇస్తామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది.ప్రస్తుతానికి, కంపెనీ ఈ స్కూటర్ ప్రత్యేకతలను ప్రకటించలేదు, కానీ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా స్కూటర్ డెలివరీ టైమ్‌లైన్ గురించి మరిన్ని వివరాలు, స్కూటర్ డ్రైవింగ్ రేంజ్ అండ్ ఛార్జింగ్ సమయంతో సహా పూర్తి వివరాలను త్వరలో వెల్లడించవచ్చు.
ఓలా క్యాబ్ సీఈఓ భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఇండియన్ రోడ్లపై ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ నడుస్తున్నప్పుడు దాని పనితీరు ఎలా ఉంటుందో వీడియో ద్వారా చూపించారు. ఈ ఇ-స్కూటర్ ఉత్పత్తి త్వరలో ప్రారంభమవుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ మొదటి దశ కేవలం నాలుగు నెలల్లో పూర్తవుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఓలా ఇ-స్కూటర్ లక్షణాల గురించి కూడా భవీష్ మాట్లాడారు. భవీష్ ట్వీట్ ప్రకారం, ఓలా ఇ-స్కూటర్‌లో బెస్ట్-ఇన్-క్లాస్ బూట్ స్పేస్ అండ్ బెస్ట్-ఇన్-క్లాస్ రైడింగ్ రేంజ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఇంకా యాప్-ఆధారిత కీలెస్ యాక్సెస్‌ను కూడా పొందుతుంది. ఒక నివేదిక ప్రకారం, నావిగేషన్ అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో చూడవచ్చు.
డ్రైవింగ్ రేంజ్ ఓలా క్యాబ్స్ నెదర్లాండ్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎటర్గోను మే 2020 లో కొనుగోలు చేసింది. స్కూటర్ స్వాప్ చేయగల అధిక శక్తి-సాంద్రత కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. సంస్థ ప్రకారం ఒక ఫుల్ ఛార్జింగ్‌తో 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఎటర్గో యాప్ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుండి 45 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో సీటు కింద 50 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం లభిస్తుంది.
50 నిమిషాల్లో 75 కి.మీఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఛార్జ్ చేయడానికి కంపెనీ ఛార్జర్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి కేవలం 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. తరువాత 75 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ఓలా స్కూటర్ ని ఇంట్లో ఛార్జ్ చేయడానికి హోమ్-ఛార్జర్ యూనిట్ కూడా అందిస్తున్నారు.