రాడార్ సిస్టంతో ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ అడ్వెంచర్ బైక్.. లాంచ్ ఎప్పుడంటే ?

First Published Jul 17, 2021, 6:46 PM IST

ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ సంస్థ డుకాటీ  భారతదేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్ట్రాడా వి4  బైక్ 2021 బుకింగ్స్  ప్రారంభించింది. ఈ బైక్‌ను కొనాలనుకునే కస్టమర్లు  లక్ష రూపాయలు  టోకెన్ మొత్తాన్ని చెల్లించి కంపెనీ డీలర్‌షిప్‌ లో యూనిట్‌ను బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ బైక్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుందని కంపెనీ సూచించింది. 
 

కొత్త మల్టీస్ట్రాడా వి4 డెలివరీలు బైక్ లాంచ్ అయిన వెంటనే ప్రారంభమవుతాయి అలాగే ఈ బైక్ అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో డిస్ ప్లే కోసం అందుబాటులో ఉంచారు. బైక్ బుక్ చేసుకోవడానికి కస్టమర్లు ఢీల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పూణే, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలోని డీలర్లను సంప్రదించవచ్చని తెలిపింది. కొత్త బైక్ టెస్ట్ రైడ్‌లు సేల్స్ ప్రారంభమైన వెంటనే ప్రారంభమవుతాయి.
undefined
ఫ్రంట్ అండ్ బ్యాక్ రాడార్ వ్యవస్థతోఫ్రంట్ అండ్ రియర్ రాడార్ సిస్టంతో వస్తున్న ప్రపంచంలోనే తొలి బైక్ ఇదేనని కంపెనీ తెలిపింది. దీనిలో రైడర్ ఎంగేజెడ్ ఉంచడానికి సంస్థ నెక్స్ట్ జనరేషన్ డుకాటీ కనెక్ట్ మిర్రరింగ్ సిస్టమ్ అందించింది. దీనికి హై పవర్ కోసం సంస్థ కొత్త వి4 గ్రాంట్యురిస్మో ఇంజిన్ దీనిలో ఉపయోగించింది. మల్టీస్ట్రాడా వి4 పవర్ - టెక్నాలజి పరంగా లేటెస్ట్ బైక్ గా అందిస్తున్నారు. అలాగే కంపెనీ ఇండియన్ లైనప్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ అడ్వెంచర్ బైక్ గా ఉంటుంది.
undefined
డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర మాట్లాడుతూ, “మల్టీస్ట్రాడా వి4 ప్రపంచవ్యాప్తంగా ప్రకటించినప్పటి నుండి అపూర్వమైన ఆదరణ కనబరుస్తోంది. డుకాటీ నుండి వచ్చిన ఈ సూపర్ బైక్ సంస్థ బెస్ట్ టెక్నాలజి పై ఆధారపడింది.
undefined
ఫ్రంట్ ఎండ్ అండ్ బైక్ వెనుక భాగంలో రాడార్ అసిస్టెన్స్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్టమొదటి బైక్. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్ డిజిటల్ డాష్‌బోర్డ్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ వంటి అనేక ఫీచర్లు కూడా ఉన్నాయి. సంస్థ డీలర్ భాగస్వాములు, సర్వీస్ బృందం ఈ సూపర్ బైక్ కోసం శిక్షణ పొందుతున్నారని చెప్పారు.
undefined
ఈ బైక్ చాలా ప్రత్యేకమైనదని, దీని అద్భుతమైన ఇంజనీరింగ్, పనితీరు, టెక్నాలజిని రైడర్స్ ఇష్టపడతారని చంద్ర పేర్కొన్నారు. ఈ బైక్‌కు రహదారులను శాసించే శక్తి ఉందని, భారతదేశంలో పవర్ ఫుల్ బైక్స్ లో ఒకటిగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
undefined
చాలా ఆధునిక టెక్నాలజితో కూడిన ఈ బైక్‌ గొప్ప అనుభవమే కాక, చాలా సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త బైక్ వేరియంట్, స్టాండర్డ్ ఎక్విప్మెంట్ గురించి మరిన్ని వివరాలు లాంచ్ సమయంలో వెల్లడి చేయనున్నారు.
undefined
click me!