హార్లీ డేవిడ్‌సన్ ప్రీమియం బైక్ కేవలం 40వేలకే.. నెలకు ఈ కొంత కడితే చాలు.. బైక్ మీ సొంతం..

First Published | Sep 11, 2023, 4:26 PM IST

ఈ ఏడాది కొత్త హార్లే డేవిడ్‌సన్ బైకుని లాంచ్  చేశారు. ఇండియాలోని తక్కువ ధర  కలిగిన బడ్జెట్ హార్లే బైక్ X440 ధర ఇంకా ఇతర ఫీచర్ల గురించి మీకోసం....
 

హార్లే-డేవిడ్సన్ X440

హార్లే-డేవిడ్సన్ X440 (Harley-Davidson X440) ఈ సంవత్సరం ప్రీమియం బైక్ మార్కెట్లో ప్రవేశపెట్టారు. భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ భాగస్వామ్యంతో ఈ బైక్ దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. హార్లే-డేవిడ్సన్ బైక్ లవర్స్ కి డ్రీమ్ బైక్. అయితే దీనిని  కొనాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. అయితే X440 లాంచ్   ఈ అధిక ధర ఆలోచనను గణనీయంగా తగ్గించింది.
 

హార్లే-డేవిడ్సన్ X440

ఈ బైక్ కొనేందుకు ఒకేసారి మొత్తాన్ని చెల్లించలేని కస్టమర్‌లకు ఆఫర్‌లు అనుకూలంగా ఉంటాయి. ఈ హార్లే-డేవిడ్సన్ బైక్  డెనిమ్ వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర Tk 2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్).  అయితే, డెనిమ్ వేరియంట్ ఆన్-రోడ్ ధర రూ.2,68,751గా ఉండనుంది.


హార్లే-డేవిడ్సన్ X440

ఈ బైక్ కొనేందుకు మొత్తం ఒకేసారి చెల్లించలేని వారు చాలా మంది ఉన్నారు. ఇందుకు  వీరికి ఫైనాన్సియల్ అప్షన్స్  ఉన్నాయి. డౌన్ పేమెంట్ అండ్ ప్రతినెలా  ఈఎంఐ  పేమెంట్  చేసిన తర్వాత మాత్రమే బైక్  మీ సొంతం అవుతుంది. ఆన్‌లైన్ EMI కాలిక్యులేటర్ ప్రకారం, మీకు రూ. 40,000 బడ్జెట్ ఉంటే ఈ  బైక్‌ను కొనుగోలు చేయవచ్చు. రూ.40,000 అడ్వాన్స్ చెల్లించిన తర్వాత బ్యాంకు ద్వారా రూ.2,28,751 లోన్ వస్తుంది. ప్రతి నెలా మీరు  EMIని కట్టాలి. ఈఎంఐ మీ లోన్ కాలానికి  బట్టి   ఇంట్రెస్ట్  ఆధారపడి ఉంటుంది.
 

హార్లే-డేవిడ్సన్ X440

హార్లీ డేవిడ్‌సన్ ఎక్స్440 బైక్‌లో 440 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌ అందించారు. మ్యాక్స్   27.37 PS శక్తిని, 38 Nm టార్క్‌ను అందిస్తుంది. 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్  ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. కంపెనీ ప్రకారం, ఈ బైక్  ARAI మైలేజ్ 35 kmpl. ఈ బైక్‌లో ఐకానిక్ హార్లే-డేవిడ్‌సన్ ఫినిషింగ్ ఇంకా థంప్ ఉన్నాయి.

హార్లే-డేవిడ్సన్ X440

అంతే  కాకుండా రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ అండ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), రెండు వీల్స్ పై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా ఈ బైక్  మార్కెట్లోకి విడుదలైంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న బైక్స్ లో ఈ బైక్ ఒకటి.

Latest Videos

click me!