ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు.. 139 కి.మీ ప్రయాణించవచ్చు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర నెలకి ఇంతేనా.!!

First Published | Sep 9, 2023, 1:32 PM IST

తక్కువ లేదా మీ బడ్జెట్  ధరలో కొత్త స్కూటర్ కోసం చూస్తున్నారా..? చిన్న చిన్న అవసరాలకు ఇంకా పనులకు పెట్రోల్ వాహనా భారాన్ని మోయలేకపోతున్నారా..  అయితే ఈ మోడల్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. మీకు బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డీల్స్ ఏంటో చూద్దాం... 

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే మీకో గుడ్ న్యూస్. అంటే మీరు డిస్కౌంట్ తో పాటు తక్కువ  EMIతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ని కొనవచ్చు. మీకు ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్లపై మంచి డిస్కౌంట్  అందిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఒకినావా కంపెనీ నుండి అనేక రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి.

వీటిలో ఐప్రైస్ ప్లస్ స్కూటర్ ఒకటి. ఈ స్కూటర్‌పై భారీ తగ్గింపు లభించనుంది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 1.46 లక్షలు. కానీ ఈ స్కూటర్ ఆన్-రోడ్ ధర ఎక్కువ. హైదరాబాద్‌లో ఈ  స్కూటర్  ఆన్-రోడ్ ధర రూ. 1.67 లక్షల వరకు ఉండవచ్చు.
 

మీరు బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్‌ని చెక్  చేస్తే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హైదరాబాద్ ఆన్ రోడ్ ధర రూ. 1.67 లక్షలు. అయితే ఇప్పుడు మీరు  రూ. 1.22 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. అంటే మొత్తం రూ. 45 వేలకు పైగా తగ్గింపు లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే మీరు ఈ స్కూటర్‌ను తక్కువ EMIతో కొనుగోలు చేయవచ్చు. ప్రతినెల EMI రూ. 3,198 నుండి ఉంటుంది.
 


రోజుకు రూ.100 ఆదా చేస్తే ఒక నెల emiకి సరిపోతుంది. స్కూటర్ కోసం మీరు రూ. 36,682 అడ్వాన్స్‌గా చెల్లించాలి. ఇంకా  36 నెలల కాలానికి  వాలిడిటీ అవుతుంది. మీరు 30 నెలల emi సెలెక్ట్ చేసుకుంటే రూ. 3680 తీసుకుంటారు. అడ్వాన్స్ రూ. 36,682 చెల్లించాలి. అదే  24 నెలలు అయితే  నెలకు రూ. 4400 చెల్లించాలి. 18 నెలలకి రూ. 5,600 తీసుకుంటారు. మీరు సెలెక్ట్ చేసుకున్న  కాలవ్యవధిని బట్టి EMI కూడా మారుతుంది.
 

అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి 3.3 kWh బ్యాటరీ ఉంది. ఛార్జింగ్ సమయం 4 నుండి 6 గంటలు పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 139 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. దీనికి డిస్క్ బ్రేకులు కూడా  ఉంటాయి. ట్యూబ్‌లెస్ టైర్లు ఉంటాయి. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వివిధ కలర్స్  లభిస్తుంది.
 

Latest Videos

click me!