షోరూమ్‌లు ఖాళీ, అత్యధికంగా కొనసాగుతున్న సేల్స్, సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా అవాక్క్..

First Published | Sep 8, 2023, 12:40 PM IST

జపనీస్ టూ-వీలర్ బ్రాండ్ సుజుకి మోటార్ కార్పొరేషన్  ద్విచక్ర వాహన అనుబంధ సంస్థ అయిన సుజుకి మోటార్ సైకిల్స్ ఇండియా భారీ సేల్స్  వృద్ధిని సాధించింది. ఆగస్టు 2022తో పోలిస్తే గత నెలలో కంపెనీ 30 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. మొత్తం అమ్మకాలు 103,336 యూనిట్లుగా నమోదయ్యాయి. 

ఇందులో దేశీయ మార్కెట్‌లో 83,045 యూనిట్లు విక్రయించగా, ప్రపంచవ్యాప్తంగా 20,291 యూనిట్లు ఎగుమతి చేయబడ్డాయి. దింతో కంపెనీ అత్యధిక ప్రతినెలా దేశీయ విక్రయాల సంఖ్యను గుర్తించింది.

కంపెనీ ఇటీవలే యాక్సెస్ 125 ఉత్పత్తి యాభై లక్షల మైలురాయిని సాధించింది. ఐదు మిలియన్ యూనిట్ల గణనీయమైన ఉత్పత్తి మైలురాయిని నమోదు చేసిన తర్వాత, కంపెనీ Access 125 - Pearl Shining Beige / Pearl Mirage Whiteలో కొత్త కలర్ అప్షన్  కూడా ప్రవేశపెట్టింది. కొత్త కలర్ స్పెషల్ ఎడిషన్ ఇంకా రైడ్ కనెక్ట్ ఎడిషన్ వేరియంట్‌లు రూ.85,300 నుండి  రూ.90,000 ధరలకు అందుబాటులో ఉంటుంది. ఈ  ధరలు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ చెందినవి.

యాక్సెస్ 125 గరిష్టంగా 8.58 bhp శక్తిని, 10 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌తో వస్తుంది. సస్పెన్షన్ డ్యూటిస్  ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు సింగిల్ షాక్ అబ్జార్బర్ ద్వారా ఉంటుంది. ఈ స్కూటర్ ముందు వీల్  డిస్క్ లేదా డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. వెనుక వీల్  డ్రమ్ బ్రేక్ మాత్రమే పొందుతుంది. స్కూటర్ CBSతో స్టాండర్డ్ గా వస్తుంది. ఇంకా  హోండా యాక్టివా 125, హీరో మాస్ట్రో 125, యమహా ఫాసినో 125, TVS జూపిటర్ 125 లకు పోటీగా నిలుస్తుంది.

Latest Videos


జూలై 2023లో సుజుకి మోటార్‌సైకిల్స్ ఇండియా కూడా అద్భుతమైన అమ్మకాలను సాధించింది. జూలై 2023లో కంపెనీ 1,07,836 యూనిట్ల అమ్మకాలను సాధించింది. 1 లక్షకు పైగా మంథ్లి విక్రయాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. ఈ లెక్కన దేశీయ మార్కెట్లో విక్రయించిన 80,309 యూనిట్లు, జూలై 2023లో అంతర్జాతీయ మార్కెట్‌లకు ఎగుమతి చేయబడిన 27,527 యూనిట్లు ఉన్నాయి. జూలై 2022తో పోల్చితే కంపెనీ సంవత్సరానికి అమ్మకాలు దాదాపు 41.5 శాతం వృద్ధిని సాధించింది. 

click me!