Tesla Affordable Cars భారత్‌లో చౌకైన కార్లు.. టెస్లా భారీ స్కెచ్!

Published : Mar 18, 2025, 08:40 AM IST

టెస్లా అనగానే బ్యాటరీతో నడిచే సూపర్ కార్లే గుర్తొస్తాయి. ఇవి ఎంత శక్తిమంతమో.. అంత ఖరీదు ఎక్కువ. అయితే కొన్నాళ్లుగా భారత మార్కెట్లో పూర్తిస్థాయిలో ప్రవేశించడానికి ఎలన్ మస్క్ సారథ్యంలోని టెస్లా సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం ఆ కంపెనీ తయారు చేస్తున్న మోడళ్ల ధరలన్నీ రూ.20లక్షల పైనే ఉన్నాయి. మధ్యతరగతి జనం ఎక్కువగా ఉండే భారత్ లో ఇంత ఎక్కువ ధరతో కార్లు కొనడం అంత సాధ్యం కాదని టెస్లా భావిస్తున్నట్టు సమాచారం. దానికి అనుగుణంగానే భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా తక్కువ ధర కార్లను తయారు చేసి ఇండియాలో విడుదల చేయాలని చూస్తోంది.  ఈ కార్లను చైనాలోని షాంఘైలో తయారు చేసి, ఆసియా మార్కెట్‌లో అమ్మకాలు జరపాలని ప్రణాళికలు వేస్తోంది టెస్లా.

PREV
15
Tesla Affordable Cars భారత్‌లో చౌకైన కార్లు..  టెస్లా భారీ స్కెచ్!

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో ట్రంప్‌తోపాటు,  టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌తో కూడా మాట్లాడారు. ఆ తర్వాత టెస్లా ఇండియాలోకి వస్తుందనే ప్రకటన వెలువడింది. ఇప్పుడు టెస్లా తక్కువ ధరకే కార్లను విడుదల చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

25

అమెరికన్ ఎంట్రీ-లెవెల్ టెస్లా కారు, వై మోడల్ ఇతర దేశాలలో కూడా తక్కువ ధరకే విడుదల కానుంది. ఈ చౌక కారు ద్వారా ఇండియాలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం టెస్లా చౌక కార్లు షాంఘై, చైనాలో ఉత్పత్తి అవుతున్నాయి.

35

టెస్లా షాంఘైలో తయారు చేసిన తక్కువ ధర కార్లను చాలా దేశాలకు ఎగుమతి చేయాలని చూస్తోంది. ఆసియా దేశాల్లో మార్కెట్‌ను ఏలాలని టెస్లా ప్లాన్ చేస్తోంది. ఆసియా మార్కెట్‌ను హస్తగతం చేసుకుంటే అమ్మకాలు పెరుగుతాయని మస్క్ భావిస్తున్నారు.

45

ప్రస్తుతం ఎంట్రీ-లెవెల్ టెస్లా కారు ధర $35,000. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 30 లక్షల రూపాయలు. షాంఘైలో తయారు చేస్తున్న టెస్లా వై మోడల్ కారు ధర ఇంకా తెలియలేదు. దీని ధర 20 లక్షల రూపాయల వరకు ఉండొచ్చని అంటున్నారు.

55

టెస్లా ఇటీవల వై మోడల్ కార్లను మరిన్ని ఫీచర్లతో రీడిజైన్ చేసింది. టెస్లా కార్లలో మోడల్ 3, మోడల్ వై ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం దాని ధర. చాలామందికి టెస్లా కారు క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ నచ్చుతున్నాయి.

click me!

Recommended Stories