ఈ బైక్ కి 24 bhp అండ్ 25.6 Nm గరిష్ట టార్క్ కెపాసిటీ ఉంది. బైకుకి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అండ్ అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ ఇచ్చారు.
డ్యూయల్-ఛానల్ ABS ఇంకా హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC)తో డ్యూయల్ డిస్క్ బ్రేక్ (276mm ఫ్రంట్ & 220mm వెనుక) అందించారు.
సస్పెన్షన్ డ్యూటీలలో గోల్డెన్ USD ఫ్రంట్ ఫోర్క్స్ అలాగే 5-స్టెప్ అడ్జస్టబుల్ రియర్ మోనో షాక్ ఉన్నాయి. ఫుల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ కూడా ఉంది.
స్పీడోమీటర్, ఓడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, ట్విన్ ట్రిప్ మీటర్స్, గేర్ పొజిషన్ ఇండికేటర్, టైం వంటి సమాచారాన్ని డిస్ ప్లే . ఇంకా ఆల్ LED లైటింగ్ సిస్టమ్, హోండా స్మార్ట్‌ఫోన్ వాయిస్ కంట్రోల్ సిస్టమ్ (HSVCS)తో వస్తుంది.
హోండా 2-వీలర్స్ ఇండియా 2023 CB300F ను రూ. 1.70 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) స్టిక్కర్ ధరతో దేశంలో లాంచ్ చేసింది.