గణేష్ చతుర్థికి బంపర్ ఆఫర్: యమహా బైక్‌లపై భారీ క్యాష్‌బ్యాక్; డౌన్ పేమెంట్ రూ.7999 నుండి!

First Published | Sep 20, 2023, 1:44 PM IST

యమహా మోటార్ ఇండియా కంపెనీ గణేష్ చతుర్థి సందర్భంగా స్పెషల్  ఆఫర్లను ప్రకటించింది. ఇప్పుడు  బైక్‌ను క్యాష్‌బ్యాక్ అండ్ తక్కువ డౌన్ పేమెంట్‌తో కోనవచ్చు. 
 

దేశంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. గణపతి  విగ్రహం ముందు ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. అలాగే మహారాష్ట్రలో గణేష్ చతుర్థిని అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
 

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రాష్ట్రంలో వేడుకలను పురస్కరించుకుని స్వాగతం పలికేందుకు యమహా మోటార్ ఇండియా కంపెనీ గణేష్ చతుర్థికి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం Yamaha   150cc FZ మోడల్ రేంజ్ అండ్ RayZR 125cc Fi హైబ్రిడ్ మోడల్ పై  ముంబైలో 30 సెప్టెంబర్ 2023 వరకు ప్రత్యేకమైన క్యాష్‌బ్యాక్ అండ్  ఫైనాన్స్ ఆఫర్‌లను అందిస్తోంది. 
 


మరోవైపు, యమహా   150cc FZ మోడల్ రేంజ్ అండ్ Fascino 125cc Fi హైబ్రిడ్ మోడల్ పై ఈ ఆఫర్‌లు మహారాష్ట్రలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉన్నట్లు నివేదించబడింది.

 మహారాష్ట్రలో యమహా కంపెనీ ఇచ్చిన ఆఫర్ వివరాలు : 

రూ.3,000 - ఇన్స్టంట్  క్యాష్‌బ్యాక్
రూ. 7,999/- నుండి ప్రారంభమయ్యే అతితక్కువ డౌన్‌పేమెంట్
వడ్డీ రేటు:  7.99%

Yamaha కంపెనీ ప్రస్తుతం YZF-R15 V4 (155cc), YZF-R15S V3 (155cc), MT-15 V2 (155cc); FZS-Fi వెర్షన్ 4.0 (149cc), FZS-Fi వెర్షన్ 3.0 (149cc), FZ-Fi వెర్షన్ 3.0 (149cc), FZ-X (149cc), అండ్ Aerox 155 (155cc), Fascino 125 FIcc హైబ్రిడ్ (125 FIcc) వంటివి పై ఆఫర్స్ అందిస్తుంది. దీనిలో  స్కూటర్లు రే ZR 125 FI హైబ్రిడ్ (125cc), రే ZR స్ట్రీట్ ర్యాలీ 125 FI హైబ్రిడ్ (125cc) వంటి బైక్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియో  ఉంది. 
 

Latest Videos

click me!