కాబట్టి, మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేయబోతున్నట్లయితే, ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి. అప్పుడు మీరు మంచి సెకండ్ హ్యాండ్ కారు కొని మీ ఇంటికి తీసుకురావచ్చు.
బడ్జెట్
సెకండ్ హ్యాండ్ కారును కొనే ముందు, మీ బడ్జెట్‌ను తెలుసుకోండి. తర్వాత, మీరు సెలెక్ట్ చేసుకున్న కారు మార్కెట్ విలువ, రి సేల్ వాల్యూ అండ్ డిమాండ్ గురించి సమాచారాన్ని సేకరించాలి. అలాగే, వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లలో ఒకే మోడల్‌కు చెందిన కార్ల రేట్లను చెక్ చేయండి. మీ బడ్జెట్ కంటే ఎక్కువ ధర ఉన్న కారును ఎప్పుడూ కొనకుండా జాగ్రత్త వహించండి.
మీరు ఏదైనా ఉపయోగించిన కారును కోనబోతున్నట్లయితే, అలా చేసే ముందు ఖచ్చితంగా కారును లాంగ్ టెస్ట్ డ్రైవ్ చేయండి . ఈ సమయంలో వాహనానికి ఎటువంటి సమస్యలను లేకుండా జరగకుండా చూసుకోండి. వాహనం కదులుతున్నప్పుడు ఇంజిన్‌తో సహా ఇతర భాగాల సౌండ్స్ పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. అలాగే, కారు నడపడం ఎంత సౌకర్యవంతంగా ఉందో, దాని ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఏంటో గమనించండి. అలాగే, వీలైతే, వాహనాన్ని ఎక్స్పర్ట్ వ్యక్తితో నడిపించి చుడండి.
మీరు ఒక మంచి టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత, కారు మార్కెట్ వాల్యూ అండ్ ధరను అంచనా వేయండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్న ఏవైనా లోపాలను పరిగణనలోకి తీసుకోండి. కార్ కి చిన్నపాటి డ్యామేజ్ ఉంటె దాన్ని రిపేర్ చేయడానికి అయ్యే ఖర్చును అంచనా వేయండి. దీని తర్వాత కారు సరైన ధరను నిర్ణయించండి.
ఖచ్చితంగా మెకానిక్ ద్వారా చెక్ చేసుకోండి
అలాగే, కారును కొనే ముందు మంచి మెకానిక్ లేదా కంపెనీకి చెందిన ఆథరైజేడ్ సర్వీస్ సెంటర్ ద్వారా చెక్ చేయించుకోండి, మీకు తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురుకావు. మెకానిక్ ద్వారా చెక్ చేయడం వలన వాహన లోపాలను మీరు అర్థం చేసుకోవడంలో మీకు ఇంకా సహాయపడుతుంది.
సర్వీస్ రికార్డ్ చెక్ చేయండి
చివరగా , కార్ సర్వీస్ రికార్డ్‌ను చెక్ చేయండి, కార్ ఎంత సర్వీస్ చేయబడింది, ఏ భాగాలు మార్చబడిందో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. అలాగే, కార్ రీడింగ్ మీటర్ బ్యాకప్ చేయలేదని నిర్ధారించుకోండి. సర్వీస్ డాకుమెంట్స్ సరిగ్గా ఉంటే, మీరు డీల్ చేయవచ్చు.