ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ కూడా కాదు; ఇతని దగ్గర ఇండియా మొత్తంలోనే ఉన్న ఒకే ఒక్క కార్ ఉంది..

First Published | Sep 5, 2023, 4:08 PM IST

మన దేశంలో లగ్జరీ కార్లు, కాస్ట్లీ  కార్ల లిస్ట్ చాలా పెద్దది. వీటిలో  మెక్‌లారెన్ 765 LT స్పైడర్  ఒకే ఒక్క కారు మాత్రమే  ఇండియాలో ఉంది. ఈ కారుకు ఓనర్ ఎవరు అనుకుంటున్నారు... ఏ ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ మాత్రం కాదు. ఈ యువ వ్యాపారవేత్త  దగ్గర దేశంలోని ధనవంతులందరినీ మించిపోయే కారు ఉంది.
 

ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ సహా ప్రముఖ వ్యాపారవేత్తలు ఇంకా సెలెబ్రిటీల ఇళ్లలో లగ్జరీ కార్లు  ఉంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి భారతదేశంలోని కొంతమంది ఉన్నత వ్యక్తులకు చెందినవి. 
 

హైదరాబాద్‌కు చెందిన ఈ యువ వ్యాపారవేత్త దగ్గర ముఖేష్ అంబానీకి, గౌతమ్ అదానీకి కూడా లేని కారు ఉంది. ఈ వ్యాపారవేత్త దగ్గర భారతదేశంలోనే ఏకైక మెక్‌లారెన్ 765 LT స్పైడర్‌  కార్ ఉంది. అతనెవరో కాదు హైదరాబాద్‌కు చెందిన నసీన్ ఖాన్.
 


నసీన్ ఖాన్ పూర్తి పేరు మహ్మద్ నసీరుద్దీన్. అతని తండ్రి కింగ్ గ్రూప్ యజమాని షెహ్నవాజ్. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆయన సొంతం. నసీర్‌ఖాన్‌కు చెందిన మొత్తం కార్ల విలువ దాదాపు రూ.60 కోట్లు.
 

భారతదేశంలో మెక్‌లారెన్ 765 LT స్పైడర్ కార్ ఒక్కటి  మాత్రమే ఉంది. అది కూడా నసీర్ ఖాన్‌ దగ్గర. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.12 కోట్లు. ఇప్పుడు ఆన్-రోడ్ ధర 15 నుండి 20 కోట్ల రూపాయలు.
 

మెక్‌లారెన్‌తో పాటు నసీర్ ఖాన్ దగ్గర  3 ఫెరారీ కార్లు, 3 లంబోర్ఘిని కార్లు, 2 రోల్స్ రాయిస్‌ కార్లు, 2 మెర్సిడెస్ బెంజ్ కార్లు, 1 ఫోర్డ్ ముస్టాంగ్‌ కార్ తో సహా ఇతర  లగ్జరీ కార్లు కూడా  ఉన్నాయి.
 

నసీర్ ఖాన్ వద్ద 20కి పైగా లగ్జరీ కార్లు, బైకులు ఉన్నాయి. సూపర్ బైక్, సూపర్ కార్ క్రేజ్ ఉన్న నసీర్ ఖాన్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

మెక్‌లారెన్ 765 LT స్పైడర్ 4.0 లీటర్ టర్బోచార్జ్డ్ V8 పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ కార్  765 PS పవర్, 800 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఇందులో 7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ ట్రాన్స్‌మిషన్, ఆల్ వీల్ పవర్ ఉంది. ఈ కారు టాప్ స్పీడ్   గంటకు 330 కి.మీ. ఈ సూపర్ కారులో హై స్పీడ్ తో ప్రయాణించే అవకాశం ఉంది.
 

Latest Videos

click me!