తక్కువ ధర.. ఎక్కువ మైలేజీ.. వాటర్ రిసిస్టెంట్ కూడా.. సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇండియాలో లాంచ్ !!

First Published | Sep 8, 2023, 11:45 AM IST

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BGAUSS భారతదేశంలో C12i EX ఎలక్ట్రిక్-స్కూటర్‌ను లాంచ్  చేసింది. కంపెనీ ఈ స్కూటర్‌ను  రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేసినప్పటి నుండి కంపెనీకి కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది.
 

BGAUSS కూడా కేవలం మూడు నెలల్లో 5,999 బుకింగ్‌లను పొందినట్లు కంపెనీ పేర్కొంది. మీరు ఈ-స్కూటర్ C12i EX కొనాలంటే   కస్టమర్‌లు కంపెనీ అధరైజెడ్ షోరూమ్ నుండి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు లేదా మీరు BGAUSS  అఫీషియల్ వెబ్‌సైట్‌  ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేయవచ్చు.
 

BGAUSS C12i EX స్కూటర్ కస్టమర్ల దృష్టిని ఆకర్షించే డిజైన్‌తో వస్తుంది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు లేటెస్ట్ టెక్నాలజీని  సమకూర్చారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో డిటాచబుల్ లిథియం అయాన్ (LFP) బ్యాటరీ ప్యాక్ ఉంది.  బ్యాటరీ ప్రాసెస్  సులభంగా ఇన్‌స్టాల్ చేయడానికి లేదా తీయడానికి వీలుగా ఉంటుంది. 
 

Latest Videos


C12i EX ఫుల్ టాప్-అప్‌లో 85 కి.మీల ARAI- సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది ఇంకా  వాటర్‌ప్రూఫ్, IP 67-రేటెడ్, ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. BGAUSS కూడా వేడి అండ్  ఎక్కువ దుమ్ములో పని చేయగలదని పేర్కొంది.
 

దీని గురించి మాట్లాడుతూ BGAUSS వ్యవస్థాపకుడు అండ్  CEO  హేమంత్ కాప్రా భారతదేశంలో EV సంస్కృతిలో విప్లవాత్మక మార్పులకు దోహదపడే హై-పర్ఫార్మెన్, సురక్షితమైన ఇంకా తెలివైన ఎలక్ట్రిక్ స్కూటర్‌లను అందిస్తుంది. నిర్మాణ నాణ్యత, భద్రత, పనితీరులో అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పడంలో కంపెనీకి ఉన్న తిరుగులేని నిబద్ధత తమను ఈ అద్భుతమైన స్థాయికి తీసుకొచ్చిందని ఆయన అన్నారు.
 

click me!