రాకర్ రెడ్, బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధర రూ.3,58,427గా ఉంది. అపెక్స్ గ్రే మోడల్ ధర రూ.3,80,921 కాగా, మిస్టర్ క్లీన్ మోడల్ ధర రూ.3,87,667గా నిర్ణయించారు.
కొత్త మోడల్‌లో ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్లు, యూఎస్‌బీ టైప్-సి చార్జింగ్, కొన్ని కాస్మెటిక్ మార్పులు వచ్చాయి. కానీ ఇంజిన్, గేర్‌బాక్స్, ఇతర మెకానికల్ భాగాల్లో పెద్దగా మార్పుల్లేవు. కాబట్టి, కాంటినెంటల్ జీటీ 650 పాతకాలపు కేఫ్ రేసర్ లుక్‌ను ఇష్టపడేవారికి, ఈ కొత్త ఫీచర్లు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.