కొత్త కారు కొన్న యంగ్ ఎనర్జిటిక్ హీరో : ఈ కారు ఎందుకింత స్పెషల్, దీనిలో ఏముంది, ధర ఎంతో తెలుసా..

 బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కు కార్లంటే చాలా ఇష్టం. అతను తన లగ్జరీ కార్లలో పయనిస్తున్నప్పుడు మనం వీటిని చూడవచ్చు. రణ్‌వీర్ సింగ్ వద్ద రేంజ్ రోవర్ వోగ్, లంబోర్ఘిని ఉరస్, మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 4Matic ఇంకా  జాగ్వార్ XJ L వంటి  స్పోర్టి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

ఇప్పుడు ఆయన గ్యారేజీకి దాదాపు రూ.50 లక్షల విలువైన మరో కారు వచ్చి చేరింది. తాజాగా ప్రీమియం SUV టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్‌ను సొంతం చేసుకున్నాడు.

 కొత్త ఫార్చ్యూనర్ ఎంత శక్తివంతమైనది?

రణ్‌వీర్ సింగ్ కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్‌ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. అతని సిగ్నేచర్ తో కూడిన '6969' రిజిస్టర్‌తో నంబర్ ప్లేట్ కూడా చూడవచ్చు. ఈ లగ్జరీ SUV 2.8-L, 4-సిలిండర్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 201.2 హెచ్‌పి,  500 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. గేర్ ట్రాన్స్‌మిషన్ చూస్తే 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అందించారు.


టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఫీచర్లు

ఈ స్టాండర్డ్ ఫార్చ్యూనర్‌ను చాలా ప్రత్యేకంగా  చేయడానికి లెజెండర్ మోడల్‌లో టయోటా ఎన్నో కాస్మెటిక్ అండ్ ఇంటీరియర్ మార్పులను చేసింది. ఇందులో క్వాడ్-LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRL, కనెక్ట్  కార్ టెక్నాలజీతో కూడిన 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్లు,  18-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఫార్చ్యూనర్‌లో ప్రత్యేకమైన ట్విన్ గ్రిల్ డిజైన్, లెదర్ సీట్లు అండ్  డ్యూయల్-టోన్ ఇంటీరియర్ కూడా ఉపయోగించారు. ఆంతేకాకుండా వైర్‌లెస్ ఛార్జింగ్ సిస్టమ్, హ్యాండ్స్-ఫ్రీ టెయిల్‌గేట్‌ అందించారు.

టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ధర ఎంత?

జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ టయోటా (భారత్‌లో టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ధర) నుండి రణ్‌వీర్ సింగ్ కొన్న  SUV ధర కేవలం రూ. 50 లక్షల లోపే ఉంటుంది. భారతదేశంలో టొయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ధర రూ. 43.22 లక్షల నుండి ప్రారంభమవుతుంది,   దాని టాప్-ఆఫ్-లైన్ మోడల్ రూ. 46.94 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద వస్తుంది.

Latest Videos

click me!