సరికొత్తగా హీరో కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్.. ఒక నెలలో రికార్డ్ బుకింగ్స్.. ఈసారి కొత్తగా స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ?

First Published | Oct 9, 2023, 2:31 PM IST

కొత్త లుక్ లో హీరో కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్ లాంచ్‌ను ప్రకటించినప్పుడు బైక్ లవర్స్ థ్రిల్ అయ్యారు. ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత   కరిజ్మా బైక్ రిఎంట్రీకి సిద్ధమైంది. అయితే ఈ బైక్  బుకింగ్‌లు ఆగస్టు 29న ప్రారంభమయ్యాయి. బుకింగ్ ప్రారంభమైన నెలకి క్లోజ్ చేసారు. రికార్డు స్థాయిలో బుకింగ్స్ అందుకున్న కరిజ్మా ఈ నెలలో  డెలివరీలను ప్రారంభించనుంది.
 

హీరో మోటోకార్ప్ కొత్తగా తీసుకొచ్చిన కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్  ప్రజల్లో మంచి  ముద్ర వేసింది. ఒక్క నెలలోనే 13,688 బుకింగ్‌లు వచ్చాయి. Hero MotoCorp డీలర్‌లకు Karizma XMR షిప్‌మెంట్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ఇంకా ఈ నెల పండుగ కాలంలో కస్టమర్‌లకు డెలివరీలు అందియించనుంది.

 కొత్త Karizma XMR ధర రూ. 1,79,900/- (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) కంపెనీ త్వరలో కొత్త బుకింగ్ విండోను ప్రారంభించనుంది.
 

కొత్త కరిజ్మా XMR  అత్యంత శక్తివంతమైన బైక్  ఇంకా పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ కి 210cc లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజన్‌తో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ ఇంకా డ్యూయల్ ఛానల్ ABSతో 6-స్పీడ్  గేర్ ట్రాన్స్‌మిషన్‌ అందించారు.

నేటి కస్టమర్లు లేటెస్ట్ టెక్నాలజీ కోసం చూస్తున్నందున, కొత్త కరిజ్మా XMR  ఫస్ట్-ఇన్-క్లాస్ అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్, ఇంటెలిజెంట్ ఇల్యూమినేషన్ హెడ్‌ల్యాంప్ ఇంకా  టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తో  తిరుగులేని అనుభవాన్ని అందించడం ఖాయం.


అద్భుతమైన ఎర్గోనామిక్స్, స్పోర్టినేస్, సౌకర్యం, డైనమిక్ పర్దార్మెన్స్ తో కొత్త కరిజ్మా XMR 210cc సెగ్మెంట్‌కు సరికొత్త స్పిన్‌ను అందిస్తుంది. కాబట్టి రైడ్ ప్రత్యేకమైనది.

హీరో కరిజ్మా ఎక్స్‌ఎమ్‌ఆర్‌కి వచ్చిన  స్పందనతో మేము థ్రిల్ అయ్యాము. అధిక సంఖ్యలో బుకింగ్‌లు మా ఈ ఫ్లాగ్‌షిప్ బైక్ పై మా కస్టమర్‌లకు ఉన్న నమ్మకం, అభిరుచిని తెలియజేస్తాయి. ప్రతి కరిజ్మా ఓనర్ కి అసాధారణమైన రైడింగ్ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము ఇంకా రాబోయే పండుగ సీజన్‌లో మరింత ఉత్సాహాన్ని నింపగలమన్న నమ్మకంతో ఉన్నాము” అని హీరో మోటోకార్ప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రంజీవ్‌జిత్ సింగ్ అన్నారు. 
 

Latest Videos

click me!