1600 కి.మీల మైలేజ్, 10 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్... ఎలక్ట్రిక్ కార్ల కోసం 'సూపర్ బ్యాటరీ'...

First Published Sep 22, 2023, 7:37 PM IST

ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న భారీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రయాణాలకి ఆటంకం కాకూడదని ప్రపంచవ్యాప్తంగా ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తున్నారు. సాధారణంగా పెట్రోల్ డీజిల్‌తో నడిచే వాహనాల్లో ఇంధన ట్యాంక్‌ని నిమిషంలోపు నింపవచ్చు, అయితే ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జ్ చేయడానికి ప్రస్తతం  గంటల సమయం  పడుతుంది. 

ఏదైనా ప్రయాణల మధ్యలో ఎక్కడైనా ఛార్జింగ్ అయిపోతే, మీరు చిక్కుకుపోవచ్చు. ఇప్పుడు ఈ సమస్యకు టొయోటా పరిష్కారం కనుగొనబోతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం సూపర్ బ్యాటరీలను టొయోటా కంపెనీ తీసుకురానుంది. ఈ కారణంగా కార్ల రేంజ్ అనేక రెట్లు పెరుగుతుంది.

టయోటా సూపర్ బ్యాటరీ 
తక్కువ రేంజ్  ఎలక్ట్రిక్ వాహనాల సమస్యను టయోటా అతి త్వరలో పరిష్కరించనుంది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ 1,600 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిక్ వాహనాల పరిధిని ఇవ్వగల బ్యాటరీని తయారు చేస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఎలక్ట్రిక్ కార్లలో మెర్సిడెస్ EQS అత్యధిక రేంజ్  ఇస్తుంది. ఈ కారు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 727 కి.మీ ప్రయాణిస్తుంది. ఇప్పుడు టొయోటా కొత్త బ్యాటరీ వస్తే ఈ బ్యాటరీని అమర్చిన కారు రేంజ్ గణనీయంగా పెరుగుతుంది.

టయోటా  కొత్త బ్యాటరీ ఎంత పవర్ ఫుల్ ?

ప్రస్తుతం లిక్విడ్ ఎలక్ట్రోలైట్ బ్యాటరీ ప్యాక్‌లను ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగిస్తున్నారు. కంపెనీ సాలిడ్ స్టేట్ బ్యాటరీ మాడ్యూల్‌పై పనిచేస్తోందని టయోటా వెల్లడించింది. ఈ బ్యాటరీ నికెల్ మెటల్ హైడ్రైడ్ ఆండ్  లిథియం ఐరన్ ఫాస్ఫేట్‌తో తయారు చేయబడింది. భవిష్యత్తులో చాలా ఎలక్ట్రిక్ కార్లు సాలిడ్ స్టేట్ బ్యాటరీలపై మాత్రమే రావొచ్చు.


టయోటా కొత్త సూపర్ బ్యాటరీ ఎప్పుడు వస్తుంది?

టయోటా ప్రకారం, లాంగ్ రేంజ్ సాలిడ్ స్టేట్ బ్యాటరీలు ప్రస్తుతం అభివృద్ధి చేయబడుతున్నాయి. సాలిడ్ స్టేట్  బ్యాటరీ అధిక ఉష్ణోగ్రత ఇంకా  అధిక వోల్టేజ్ ఛార్జింగ్‌కు సపోర్ట్  ఇస్తుంది. 2028 నాటికి ఈ బ్యాటరీని విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. కేవలం 10 నిమిషాల్లో ఫుల్  ఛార్జ్ అవడం  ఈ బ్యాటరీ అతిపెద్ద ఫీచర్. కొత్త బ్యాటరీతో పాటు, టయోటా బ్యాటరీ సైజ్  కూడా తగ్గించే పనిలో పడింది.

click me!