ఇప్పుడు పెట్రోల్ లేకుండా కూడా మీ బైక్ నడుస్తుంది.. ఎలా అనుకుంటున్నారా..

First Published | Sep 22, 2023, 3:05 PM IST

ఇప్పుడు మీ బైక్ పెట్రోల్ తో కాకుండా కూడా నడుస్తుంది. ఎలా అని ఆశ్చర్యపోతున్నారా.. అతి త్వరలో దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో CNGతో నడిచే  బైకును విడుదల చేయనుంది. దింతో బజాజ్  వాహన పోర్ట్‌ఫోలియోలో పెద్ద మార్పును వెల్లడించింది. 

 ఈ బైక్ భారతదేశపు మొదటి CNG బైక్  కావచ్చు. కంపెనీ ఎండి రాజీవ్ బజాజ్ కొత్త పల్సర్‌ 100 సిసి  సిఎన్‌జితో నడిచే బైక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. సిఎన్‌జి బైక్‌లను ప్రవేశపెట్టడం వల్ల పెట్రోల్ ధరను తగ్గించవచ్చని అన్నారు. సిఎన్‌జి వాహనాలకు ఇంధనం నింపడం చాలా సులభమని, సిఎన్‌జి బైక్‌ల  గురించి ఆందోళన కూడా ఉండదని ఆయన అన్నారు.

బజాజ్  CNG బైక్  ఎప్పుడంటే ?

బజాజ్ చాలా కాలంగా CNG బైక్‌ను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాజీవ్ బజాజ్ 17 సంవత్సరాల క్రితం 2006లో ఇటువంటి బైక్ కాన్సెప్ట్ గురించి ప్రస్తావించారు. పెట్రోల్‌తో పాటు సీఎన్‌జీతో నడిచే బైక్‌ను తీసుకురావాలని సూచించాడు. ఈ బైక్‌లో డ్యూయల్ ఫ్యూయల్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. తక్కువ ధర బైక్‌లకు ఉన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, బజాజ్ CNG బైక్‌లను విడుదల చేయగలదని తెలిపారు.
 

Latest Videos


పల్సర్ తీసుకురావాలని ప్లాన్

బజాజ్ పల్సర్ యువతకి  మొదటి అప్షన్ గా పరిగణించబడుతుంది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్‌ను అతిపెద్ద ఇంజన్‌తో మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. అయితే, దీనికి సంబంధించి ఇంకా ఎక్కువ సమాచారం వెల్లడికాలేదు. బజాజ్ పల్సర్  ఇప్పటికే 250cc అతిపెద్ద ఇంజన్‌తో మార్కెట్‌లో ఉంది. బజాజ్  అతిపెద్ద ఇంజన్ బైక్ డొమినార్ కూడా 400cc ఇంజన్‌తో అందుబాటులో ఉంది. బజాజ్ ఇంతకంటే పెద్ద ఇంజన్‌తో పల్సర్‌ని తీసుకురావాలని ప్లాన్ చేస్తే, దానిని  డొమినార్ ఇంజిన్‌తో తీసుకురావచ్చు.
 

29-year-old Bajaj Chetak scooter revived- Video goes viral

చేతక్   కొత్త లుక్ 

బజాజ్ ఆటో కూడా   ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్‌ను మెరుగుపరచడానికి సిద్ధమవుతోంది. చేతక్  కొత్త మోడల్ కొత్త లుక్ లో  రావచ్చు. పండుగ సీజన్ తర్వాత ఈ మోడళ్లను వెల్లడించవచ్చు. ఈ పండుగ సీజన్ నాటికి కంపెనీ 10 వేల చేతక్ మోడళ్లను ఉత్పత్తి చేయనుంది.

click me!