మార్చి 31, 2024న 'ఫేమ్' (FAME) స్కీమ్ ముగిశాక, ఆరు నెలల పాటు రూ.778 కోట్లతో 'ఈఎంపీఎస్ 2024' (EMPS 2024) నడిచింది. ఆ తర్వాత అక్టోబర్ 1, 2024న రూ.10,900 కోట్ల భారీ బడ్జెట్‌తో 'పీఎం ఈ-డ్రైవ్' మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా EV వెహికిల్స్ వినియోగం మరింత పెరిగింది.
దేశవ్యాప్తంగా ఈవీల వాడకాన్ని పెంచడంతో పాటు ఛార్జింగ్ స్టేషన్లు, లోకల్ మాన్యుఫ్యాక్చరింగ్‌ను డెవలప్ చేయడానికి కేంద్రం ఈ ‘పీఎం ఈ-డ్రైవ్’ స్కీమ్ తెచ్చింది. దీంతో సెప్టెంబర్ 26, 2026 నాటికి 34.18 లక్షల ఈవీ వెహికిల్స్ ఇండియాలో రిజిస్టర్ అయ్యాయి.
రిజిస్టర్ అయిన వెహికల్స్ డీటెయిల్స్
టూ-వీలర్స్ : మొత్తం రిజిస్ట్రేషన్లలో 91% వాటాతో (సుమారు 31.19 లక్షలు) టూ-వీలర్స్ టాప్‌లో ఉన్నాయి.
ఆటోలు : 2.88 లక్షల ఎలక్ట్రిక్ ఆటోలు రిజిస్టర్ అయ్యి 8.4% వాటాను దక్కించుకున్నాయి.
ఇతర వెహికల్స్ : 11,121 ఈ-రిక్షాలు, ఈ-కార్ట్‌లతో పాటు 236 ఎలక్ట్రిక్ లారీలు రోడ్డెక్కాయి.