ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్ కార్ లాంచ్.. ఇలాంటి కాన్సెప్ట్ డిజైన్, ఫీచర్స్ ఎప్పుడైనా చూసారా..

First Published | Jan 26, 2022, 5:06 AM IST

ఓలా ఎలక్ట్రిక్ (ola electric) సీఈఓ భవిష్ అగర్వాల్ ఓలా నుండి రాబోయే ఎలక్ట్రిక్ కారు టీజర్ ఫోటోని సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో  రానున్న ఓలా  ఎలక్ట్రిక్ కారు  డిజైన్ కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది, ఇంకా స్టైలిష్ బ్యాటరీ-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఉండనుంది. రైడ్-షేరింగ్ స్టార్టప్-టర్న్-ఇవి మేకర్ త్వరలో ఈ ఎలక్ట్రిక్ కారును తీసుకురానున్నట్లు ఓలా  సి‌ఈ‌ఓ సోమవారం సూచించిన తర్వాత లేటెస్ట్ టీజర్ ఫోటో వచ్చింది.

భవిష్ అగర్వాల్ ఒక ట్వీట్‌కు రిట్వీట్ చేస్తూ టాటా నెక్సాన్ ఈ‌వి, ఓల ఎస్1 ఇ-స్కూటర్‌లను కొనుగోలు చేసిన వారు నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేయమని సోమవారం పోస్ట్ చేశారు.  

రైడ్-షేరింగ్ సర్వీస్ అగ్రిగేటర్ స్టార్టప్ ఓలా చాలా సంవత్సరాలుగా భారతీయ మార్కెట్లో స్థిరపడిన తర్వాత గత సంవత్సరం ఎలక్ట్రిక్ వాహన తయారీ వ్యాపారంలోకి ప్రవేశించింది. మొదట ఓలా ఎస్1 అండ్ ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది, వీటిని భారతదేశంలోనే తయారు చేసారు.  అంతేకాకుండా వాహనదారుల నుండి గొప్ప స్పందనను కూడా పొందాయి. ఇప్పుడు, ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా లాభాలను ఆర్జించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
 


అయితే ఈ ఎలక్ట్రిక్ కారును 2023 నాటికి  విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోందని ఓలా సీఈవో గతంలోనే సూచించాడు. మీడియా నివేదికల ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ అధికారి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ కారు కోసం పనులు తీవ్రంగా జరుగుతున్నాయని  ఇంకా భవిష్ అగర్వాల్ విడుదల చేసిన టీజర్ ఫోటో కాన్సెప్ట్ కారు అని చెప్పారు. 
 

"ప్రస్తుత ఉన్న ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ టూ వీలర్‌ల కోసం. అయితే మా నాలుగు చక్రాల వాహనాలకు ప్రత్యేక ఫ్యూచర్‌ఫ్యాక్టరీ అవసరం. ప్రస్తుత ఫోర్ వీలర్ డిజైన్ ప్రోగ్రెస్‌లో ఉన్నప్పటికి టీజర్‌కు అనుగుణంగా నేటి ట్వీట్ ఉంది" అని అధికారి తెలిపారు. 

ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి ప్రస్తావిస్తూ ఓలా  మొదటి ఎలక్ట్రిక్ కారు 2023లో వస్తుందని, ఈ ప్రాజెక్ట్‌కు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మద్దతు ఇస్తుందని భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చడమే తమ సంస్థ లక్ష్యం అని ఆయన నొక్కి చెప్పారు. అయితే, ఓలా  నుండి రాబోయే ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు. 

ఓలా ఎలక్ట్రిక్ కారు తమిళనాడులోని ఈవీ తయారీ ప్లాంట్‌లో తయారయ్యే అవకాశం ఉంది. ఈ తయారీ కర్మాగారం ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా పేర్కొనబడుతోంది. 

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. గ్లోబల్ వార్మింగ్‌కు దోహదపడే వాహనాల ఉద్గారాల గురించి పెరుగుతున్న ఆందోళన దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలలో పెద్ద పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది. . 

ఓలా ఇటీవలే  కొత్త సంస్థ ఓలా కార్ల క్రింద భారతదేశంలో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే వ్యాపారంలోకి ప్రవేశించింది. కంపెనీ  ఈ యూనిట్ భారతదేశంలోని చాలా నగరాల్లో ఉపయోగించిన కార్లను విక్రయిస్తుంది.

Latest Videos

click me!