మహీంద్రా షోరూమ్‌లో రైతుని అవమానించడంపై ఆనంద్ మహీంద్రా ట్వీట్.. అలాంటివి జరిగితే వెంటనే పరిష్కారం అంటూ..

First Published Jan 26, 2022, 12:23 AM IST

న్యూఢిల్లీ: కర్నాటకలోని మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్‌యూ‌వి షోరూమ్‌లో ఒక రైతుని సేల్స్ సిబ్బంది  అవమానించాడని వచ్చిన ఆరోపణల  తర్వాత దేశీయ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మంగళవారం ఒక వ్యక్తి  గౌరవాన్ని నిలబెట్టడంపై  ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు."@MahindraRise ముఖ్య ఉద్దేశ్యం మన కమ్యూనిటీలు, మొత్తం వాటాదారులను ముందుకు తీసుకెళ్లాడమే. అలాగే ఒక విలువైన కీలక వ్యక్తి  గౌరవాన్ని నిలబెట్టడం.

అలాగే ఒక విలువైన కీలక వ్యక్తి  గౌరవాన్ని నిలబెట్టడం. ఈ ఫీలాసఫి నుండి ఏదైనా ఉల్లంఘన జరిగినప్పుడు  తక్షణమే పరిష్కరించబడుతుంది" అంటూ ట్వీట్ చేశారు. ఆలాగే మహీంద్రా అండ్ మహీంద్రా సి‌ఈ‌ఓ వీజయ్ నక్రా చేసిన ట్వీట్ తో ట్యాగ్ చేశారు.సి‌ఈ‌ఓ వీజయ్ నక్రా  ఈ సంఘటనపై  కౌన్సెలింగ్ అండ్ ఫ్రంట్‌లైన్ సిబ్బందికి శిక్షణతో సహా పూర్తి విచారణ, చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

విషయంలోకి వెళితే కర్ణాటకలోని ఒక రైతు  బొలెరో పిక్-అప్ ట్రక్కును కొనుగోలు చేయడానికి షోరూమ్‌కు వెళ్ళగా  తాను వాహనం కొనుగోలు చేయడంపై  ఒక సేల్స్‌మెన్ తనను అవమానించాడని చెప్పడంతో ఈ  సంఘటన వెలువడింది. దీంతో ఆ రైతు అతనిని ఛాలెంజ్ చేస్తూ  ఒక గంటలో నగదుతో షోరూమ్‌కు తిరిగి వచ్చాడు. చివరకు ఆ సేల్స్ మాన్ రైతుకీ క్షమాపణలు తెలిపాడు
 

గత వారం శుక్రవారం కర్ణాటకలోని తుమకూరు మహీంద్రా షోరూమ్‌లో జరిగిన ఈ సంఘటన  వీడియో విస్తృతంగా వైరల్ అయ్యింది అలాగే మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ట్విట్టర్‌లో ఫ్లాగ్ చేయబడ్డాయి. కర్ణాటక రైతు కెంపేగౌడ బొలెరో పికప్ ట్రక్కు కొనేందుకు వెళ్లగా సేల్స్ మెన్ హేళన చేస్తూ ప్రవర్తించి వెళ్లిపోవాలని కోరాడని సమాచారం. 

బొలెరో పికప్ ట్రక్కు  విలువ  10 లక్షలు ఉంటుందని సేల్స్ మ్యాన్ చెప్పగా,  రైతు ప్రకారం " మీ జేబులో రూ.10 కూడా ఉండకపోవచ్చు " అని సేల్స్ మ్యాన్ తనతో అన్నడని చెప్పాడు.  కెంపెగౌడ బట్టలు, రూపాన్ని బట్టి  అవమానించారని రైతు, అతని స్నేహితులు ఆరోపించారు. దీంతో ఈ వాగ్వాదం చెలరేగింది. అప్పుడు కెంపెగౌడ ఒక గంటలో డబ్బు తీసుకువస్తే అదే రోజు బోలెరో ఎస్‌యూ‌విని డెలివరీ చేస్తావ అని  సేల్స్‌మన్‌తో  అన్నాడు.
 

చివరికి నగదుతో తిరిగి వచ్చిన రైతుని చూసి ఆశ్చర్యపోయిన సేల్స్ ఎగ్జిక్యూటివ్ వాహనాన్ని తక్షణమే  డెలివరీ చేయలేకపోయారు. అయితే వాహనం డెలివరికి సాధారణంగా వెయిట్‌లిస్ట్ ఉంటుంది. అయితే కారు డెలివరీ చేయడానికి సుమారు నాలుగు రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

దీంతో మండిపడిన కెంపెగౌడ, అతని స్నేహితులు వెంటనే తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సర్ధుచేశారు. అలాగే సేల్స్ ఎగ్జిక్యూటివ్  కెంపెగౌడకు క్షమాపణలు చెప్పడంతో "నాకు మీ షోరూమ్ లో వాహనం కొనడం ఇష్టం లేదు," అంటూ రైతు తన రూ.10 లక్షలతో తిరిగి వెళ్లిపోయాడు.

click me!