Ola Scooter Offers : కేవలం రూ.59,999 కే ఓలా స్కూటర్, నెలనెలా అతి తక్కువ EMI.. ఈ ఆఫర్ మిస్ అవ్వొద్దు

Published : Aug 24, 2026, 06:05 PM IST

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఉన్నా అధిక ధర, ఎక్కువ EMI చూసి చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ఓలా ఇప్పుడు తక్కువ ధరకే స్కూటర్‌ను అందిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

PREV
15
రూ.59 వేలకే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

తక్కువ ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఓలా ఎస్1 ఎక్స్ మంచి ఆప్షన్. ముఖ్యంగా దీని 2 kWh బ్యాటరీ మోడల్‌పై ఓలా వెబ్‌సైట్‌లో రూ.25,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. దీంతో దీని ధర రూ.59,999గా చూపిస్తోంది. అందుకే తక్కువ బడ్జెట్‌లో ఈవి స్కూటర్ చూసేవాళ్లను ఇది ఆకర్షిస్తోంది. కానీ ఇది కేవలం ఎక్స్‌-షోరూమ్ ధర మాత్రమే. రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, ఇతర ఛార్జీలు కలిపితే ఆన్-రోడ్ ధర మారుతుంది.

25
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్

ఓలా ఎస్1 ఎక్స్ 2 kWh మోడల్ అసలు ఎక్స్-షోరూమ్ ధర రూ.84,999. దీనిపై ప్రస్తుతం రూ.25,000 డిస్కౌంట్ ఇస్తుండటంతో ఆఫర్ ధర రూ.59,999గా ఉంది. ఇదే సిరీస్‌లో 3 kWh మోడల్ ధర రూ.81,499, 4 kWh మోడల్ ధర రూ.97,499గా కంపెనీ లిస్ట్ చేసింది.

మీ బడ్జెట్, ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా వేర్వేరు బ్యాటరీ మోడళ్లను ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ ధరలు ఎప్పుడైనా మారొచ్చు. కాబట్టి బుక్ చేసే ముందు ప్రస్తుత ధరను చెక్ చేసుకోవడం మంచిది.

 

35
ఓలా ఎలక్ట్రిక్ ఆఫర్

నగరాన్ని బట్టి స్కూటర్ ఆన్-రోడ్ ధరలో తేడా ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్‌లో S1 X 2 kWh మోడల్ ధర కొన్ని వెబ్‌సైట్లలో రూ.89,789గా చూపిస్తుంటే, మరికొన్నింటిలో రూ.1.03 లక్షలకు పైగా చూపిస్తోంది. ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలలో తేడాల వల్లే ఈ గ్యాప్ వస్తుంది. కాబట్టి వెబ్‌సైట్ ధరను చూసి ఫైనల్ అనుకోవద్దు. మీ నగరంలోని షోరూమ్‌లో ఆన్-రోడ్ ధర ఎంత ఉందో కనుక్కోవడం ఉత్తమం.

45
జీరో ప్రాసెసింగ్ ఫీజు

లోన్‌పై స్కూటర్ కొనాలనుకునే వారికి ఓలా కొన్ని ఫైనాన్స్ ఆప్షన్లు ఇస్తోంది. కంపెనీ వెబ్‌సైట్‌లో 6.99% నుంచి వడ్డీ, జీరో ప్రాసెసింగ్ ఫీజు ఆఫర్ చూపిస్తున్నారు. కానీ ఈ వడ్డీ రేటు అందరికీ ఒకేలా ఉండదు. మీ క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, కాలపరిమితిని బట్టి అసలు EMI మారుతుంది. అందుకే యాడ్‌లో చూపించే తక్కువ EMIని మాత్రమే కాకుండా, డౌన్‌పేమెంట్, మొత్తం వడ్డీ ఎంత కట్టాలో కూడా లెక్కించుకోవడం చాలా ముఖ్యం.

55
ఓలా స్కూటర్ డిస్కౌంట్

మొత్తం మీద తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఓలా S1 X ఒక మంచి ఛాయిస్. ముఖ్యంగా 2 kWh మోడల్‌కు ప్రస్తుతం రూ.59,999 డిస్కౌంట్ ధర ఉండటంతో బడ్జెట్ కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. అయితే ఆన్-రోడ్ ధర, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, లోన్ ఛార్జీలు అన్నీ కలిపితేనే అసలు ఖర్చు తెలుస్తుంది. మీ పిన్ కోడ్ ఆధారంగా ధర మారవచ్చని ఓలా సేల్స్ పేజీలో ఉంది. కాబట్టి, డబ్బులు కట్టే ముందు మీ అడ్రస్‌కు ఫైనల్ కొటేషన్ తీసుకుని, అన్నీ చెక్ చేసుకోవడం చాలా అవసరం.

 

Read more Photos on
click me!

Recommended Stories