Hatchback Cars Sales: రూ. 4.99 లక్షల కారు దాటికి స్విఫ్ట్, బలేనో క్లీన్ స్వీప్.. నంబర్ 1 కార్ ఇదే

Published : Aug 20, 2026, 01:02 PM IST

Hatchback Cars Sales India: జులై 2026లో 23,338 యూనిట్ల విక్రయాలతో మారుతి వాగన్ఆర్ భారతదేశంలో నంబర్-1 హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది. ఈ విభాగంలో మొత్తం అమ్మకాలు 1,07,602 యూనిట్లకు చేరాయి.

PREV
15
హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో మైండ్ బ్లోయింగ్ కంబ్యాక్

భారతీయ కార్ల మార్కెట్‌లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఉన్న డిమాండ్ అంత ఇంత కాదు.. రికార్డు సేల్స్ తో మరోసారి ఇద నిరూపితమైంది. జులై 2026లో ఈ సెగ్మెంట్ చాలా స్ట్రాంగ్ సేల్స్ నమోదు చేసింది. చాలా కాలం తర్వాత హ్యాచ్‌బ్యాక్ కార్ల మొత్తం మంత్లీ సేల్స్ 1 లక్ష యూనిట్ల మార్కును దాటేశాయి. జులై 2026లో దేశంలో ఏకంగా 1,07,602 హ్యాచ్‌బ్యాక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అంటే జులై 2025లో ఈ సంఖ్య 74,475 యూనిట్లుగా మాత్రమే ఉండేది. అంటే ఏడాది కాలంలో అమ్మకాలు 33,127 యూనిట్లు పెరిగి, వార్షికంగా 44.48 శాతం గ్రోత్ నమోదు చేశాయి.

25
రూ. 4.99 లక్షల వాగన్ ఆర్ నంబర్-1

స్టార్టింగ్ ప్రైస్ రూ. 4.99 లక్షలు ఉన్న మారుతి సుజుకి వాగన్ ఆర్ (WagonR) అమ్మకాల్లో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. జులై 2026లో కంపెనీ 23,338 వాగన్ ఆర్ కార్లను విక్రయించింది. జులై 2025లో సేల్ అయిన 14,710 యూనిట్లతో పోలిస్తే ఇది 58.65 శాతం పెరుగుదల. మొత్తం హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల్లో వాగన్ ఆర్ షేర్ 21.69 శాతంగా ఉంది. తక్కువ ధర, మంచి మైలేజ్, సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్ ఉండటంతో యూజర్లు ఈ కారును తెగ ఇష్టపడుతున్నారు.

35
రెండు, మూడు స్థానాల్లో స్విఫ్ట్, బలేనో

రెండో స్థానంలో మారుతి సుజుకి స్విఫ్ట్ నిలిచింది. జులై 2026లో స్విఫ్ట్ 21,538 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జులైలో అమ్మిన 14,190 యూనిట్లతో పోలిస్తే ఇది 51.78 శాతం గ్రోత్. స్పోర్టీ డిజైన్, ఫీచర్ల కారణంగా ఈ కారు 20 శాతం మార్కెట్ షేర్ సాధించింది. ఇక మూడో స్థానంలో మారుతి బలేనో నిలిచింది. జులై 2026లో బలేనో 18,241 యూనిట్ల సేల్స్ సాధించి 45.89 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. బలేనో మార్కెట్ షేర్ 16.95 శాతంగా ఉంది.

45
అందరినీ షాక్ చేసిన మారుతి ఆల్టో గ్రోత్

ఈ సేల్స్ రిపోర్ట్‌లో అందరినీ ఆశ్చర్యపరిచింది మారుతి ఆల్టో. జులై 2026లో ఆల్టో 12,534 యూనిట్లు అమ్ముడయ్యాయి. జులై 2025లో నమోదైన 5,910 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 112.08 శాతం పెరుగుదల. అంటే ఏడాది వ్యవధిలో అమ్మకాలు రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. నాల్గో స్థానంలో ఆల్టో నిలవగా, టాప్-5లో టాటా టియాగో/EV 7,429 యూనిట్ల అమ్మకాలతో (33.26% గ్రోత్) ఐదో స్థానాన్ని సొంతం చేసుకుంది.

55
ఇతర కంపెనీల కార్ల పరిస్థితి ఏంటి?

సేల్స్ ఛార్ట్‌లో హ్యుందాయ్ i20 6,738 యూనిట్లతో (98.41% గ్రోత్) ఆరో స్థానంలో నిలిచింది. టయోటా గ్లాంజా 4,461 యూనిట్లు అమ్ముడై 11.12 శాతం తగ్గుదల నమోదు చేసింది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ 4,055 యూనిట్లు, మారుతి సెలెరియో 3,914 యూనిట్లు, టాటా ఆల్ట్రోజ్ 2,862 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఎంజీ కామెట్ ఈవీ 1,116 యూనిట్లు, సిట్రోయెన్ C3 680 యూనిట్లు, రెనో క్విడ్ 516 యూనిట్లు విక్రయమయ్యాయి. చివరి స్థానాల్లో మారుతి S-ప్రెస్సో (100 యూనిట్లు), సిట్రోయెన్ eC3 EV (80 యూనిట్లు) నిలిచాయి. మారుతి ఇగ్నిస్ మాత్రం సున్నా సేల్స్ నమోదు చేసింది. SUVల ట్రెండ్ నడుస్తున్నా, నగరాల్లో తేలిగ్గా నడపడానికి, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే హ్యాచ్‌బ్యాక్‌ల క్రేజ్ తగ్గలేదని ఈ డేటా చెబుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories