ఇంటెలిజెంట్ టెక్నాలజీతో బిఎమ్‌డబ్ల్యూ కొత్త ఎడిషన్.. ధర, ఫీచర్స్ గురించి తెలుసుకోండి..

First Published | Jul 15, 2021, 3:40 PM IST

లగ్జరీ కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ  తాజాగా బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. భారత మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 20ఐ టెక్ ఎడిషన్ ఎక్స్‌-షోరూమ్ ధర రూ .43 లక్షలు. ఈ ప్రీమియం కాంపాక్ట్ స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్ (ఎస్‌ఏవి)ను చెన్నైలోని బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ ప్లాంట్‌లో స్థానికంగా తయారు చేయనున్నారు. 

అయితే లిమిటెడ్ యూనిట్ల బుకింగ్స్ మాత్రమే ప్రారంభమైంది. ఈ కారు కొనాలనుకునే వారు భారతదేశంలోని కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
లుక్ అండ్ డిజైన్బిఎమ్‌డబ్ల్యూ కొత్త కారు ఎక్స్టీరియర్ ఇంకా డిజైన్ గురించి మాట్లాడుతుంటే ముందు భాగంలో పెద్ద బిఎమ్‌డబ్ల్యూ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్‌ఇడి హెడ్‌లైట్‌లు ఇచ్చారు, అలాగే ఎల్‌ఇడి ఫాగ్ లాంప్‌లు కారును మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. కారు వెనుక డిజైన్ గురించి మాట్లాడితే చాలా స్పోర్టి లుక్ ఇస్తుంది, దీనికి ఎల్‌ఈ‌డి బ్యాక్ లైట్లు, పెద్ద ట్విన్ ఎగ్జాస్ట్ టెయిల్ పైప్స్ ఇచ్చారు. కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ కారు స్పోర్టి విజువల్ అప్పీల్‌కు తోడ్పడతాయి.

ఇంజిన్ అండ్ పవర్కొత్త బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 sDrive20ఐలో 2.0-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ బిఎమ్‌డబ్ల్యూ ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 192 హెచ్‌పి శక్తిని, 280 ఎన్‌ఎమ్‌ల గరిష్ట టార్క్ 1,350 నుండి 4,600 ఆర్‌పిఎమ్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 7-స్పీడ్ VASTEPtronic Sport ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ గేర్ జతచేశారు. డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ కంట్రోల్ స్విచ్ ఉపయోగించి వేర్వేరు డ్రైవింగ్ మోడ్‌ల మధ్య మారవచ్చు. ఈ కారులో 3 డ్రైవింగ్ మోడ్‌లు లభిస్తాయి - ఏకొ ప్రొ, కంఫర్ట్ అండ్ స్పోర్ట్.
ఫీచర్స్బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 ఐడ్రైవ్ కంట్రోలర్ ఇంకా టచ్ ఫంక్షనాలిటీతో నావిగేషన్ వంటి ఫీచర్స్ కొత్త హై-రిజల్యూషన్ 10.25-అంగుళాల సెంట్రల్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, నావిగేషన్, కాంటాక్ట్స్, మెసేజెస్, మ్యూజిక్, వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, సెంట్రల్ కన్సోల్‌లోని ఇంటిగ్రేటెడ్ స్మార్ట్‌ఫోన్ హోల్డర్ నుండి మొబైల్ ఫోన్‌ వైర్‌లెస్ ఛార్జింగ్ చేయవచ్చు. పార్కింగ్ సెన్సార్స్, బ్యాక్ వ్యూ కెమెరా పార్కింగ్ మరింత సులభం చేస్తుంది. కొత్త బిఎమ్‌డబ్ల్యూ హెడ్స్-అప్ డిస్ ప్లే ప్రయాణ సంబంధిత సమాచారాన్ని నేరుగా డ్రైవర్ ముందు ప్రదర్శిస్తుంది. ఈ కారులో కొత్త 205W హైఫై లౌడ్‌స్పీకర్ సిస్టమ్‌ లభిస్తుంది.
భద్రతా ఫీచర్స్ఎమ్‌డబ్ల్యూ ఎక్స్‌1 sDrive20ఐకి 6 ఎయిర్‌బ్యాగులు, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC)తో డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (DSC), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (CBC), ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, సైడ్-ఇంపాక్ట్ ప్రొటెక్షన్ అండ్ టెక్నాలజీ వంటి ఎమ్‌డబ్ల్యూ భద్రతా ఫీచర్స్ ఉంటాయి. ఇవి కాకుండా ఎలక్ట్రానిక్ వెహికల్ ఇమ్మొబిలైజర్, క్రాష్ సెన్సార్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటు, ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ స్పేర్ వీల్ లభిస్థాయి.

Latest Videos

click me!