'జైలర్' సూపర్ సక్సెస్, తలైవా ముత్తుకి కొత్త కారు గిఫ్ట్ ఇచ్చిన నిర్మాత.. సోషల్ మీడియాలో వీడియో పోస్ట్..

First Published | Sep 4, 2023, 3:05 PM IST

ఆగస్ట్ 10న విడుదలైన 'జైలర్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల విడుదలైన జైలర్ చిత్రం అద్భుత విజయం తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా నిలిచారు. ‘జైలర్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.564.35 కోట్లకు పైగా వసూలు చేసింది 
 

జైలర్ చారిత్రాత్మక విజయం సాధించడంతో, సన్ పిక్చర్స్ నిర్మాత కళానిధి మారన్ రజనీకాంత్‌ను కలుసుకుని లెజెండరీ నటుడికి చెక్ అందజేశారు. అంతే కాదు 'జైలర్' విజయాన్ని పురస్కరించుకుని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ గిఫ్ట్ కూడా అందుకున్నారు. కళానిధి మారన్ హీరోకి సరికొత్త BMW X7ను గిఫ్ట్ ఇచ్చారు.

జైలర్ సక్సెస్‌తో సూపర్‌స్టార్ రజనీకాంత్ అండ్ చిత్ర బృందం మొత్తం సంబరాలు చేసుకుంటున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్ల మార్క్‌ను దాటేస్తోంది. సెప్టెంబర్ 1న సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ రజనీకాంత్‌కి సరికొత్త BMW X7 కారును గిఫ్ట్ ఇస్తూ సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేశారు. 
 


2023లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో 'జైలర్' ఒకటి. రజనీకాంత్‌కు కళానిధి మారన్ కారు గిఫ్ట్ ఇచ్చిన వీడియోను సన్ పిక్చర్స్ సోషల్ మీడియా Xలో  షేర్ చేసింది. దీనికి 'జైలర్ సక్సెస్ సెలబ్రేషన్ కంటిన్యూస్' అని క్యాప్షన్ ఇచ్చారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వివిధ కార్ల మోడల్స్‌ని చూపించారు. తర్వాత కళానిధి మారన్ సూపర్ స్టార్ సెలెక్ట్  చేసిన సరికొత్త BMW X7 కారు కీని అందించారు. ఈ కారు ధర 1.24 నుంచి 1.26 కోట్లుగా ఉన్న సంగతి తెలిసిందే.
 

చెన్నైలోని సిటీ యూనియన్ బ్యాంక్ మండవేలి బ్రాంచ్ నుండి 100 కోట్లు కవరులో కళానిధి మారన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అందజేశారు. ఈ చెక్ జైలర్ ప్రాఫిట్ షేరింగ్ చెక్ అని పేర్కొన్నారు . 

రజనీకాంత్ ఇటీవల 'జైలర్' విజయాన్ని తన బృందంతో జరుపుకున్నారు. ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఆండ్ ఆగస్ట్ 10న 10 భాషల్లో విడుదలైంది. ఈ సినిమాలో వినాయకన్, రమ్యకృష్ణ, వసంత రవి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ఇంకా  జాకీ ష్రాఫ్ అతిధి పాత్రల్లో నటించారు.

Latest Videos

click me!