లైసెన్స్.. కీ కూడా అవసరం లేదు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషాలిటీ వేరే లెవెల్..

First Published | Feb 9, 2024, 7:33 PM IST

రూ.55,555కి అన్ని రకాల ఫీచర్లతో విడుదలైన  ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి తెలుసుకోండి... ఎందుకంటే భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. 

ద్విచక్ర వాహనాలు కాకుండా, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తిని ఎక్కువగా  కనబరుస్తున్నారు, ముఖ్యంగా స్కూటర్ సెగ్మెంట్లో.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆపరేట్ చేయడానికి ఎలాంటి కీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.  దీని ప్రారంభ ధర ఇప్పుడు రూ.55,555కి తగ్గింది. కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.999తో బుక్  చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ పేరు Yulu Wynn.  
 

Yulu Wynn సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (CMVR) కింద తక్కువ స్పీడ్  కేటగిరీ కిందకు వస్తుంది, కాబట్టి దీన్ని నడపడానికి మీకు హెల్మెట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ అవసరం లేదు. దీనిలో కంపెనీ 15 వోల్ట్ 19.3Ah బ్యాటరీ ప్యాక్‌ను అందించింది.
 

Latest Videos


దీని బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 68 కిలోమీటర్ల వరకు IDC పరిధితో వస్తుంది. అయితే, నగరంలో దీని పరిధి 61 కిలోమీటర్లు. BLDC ఎలక్ట్రిక్ మోటారు ఇందులో ఉపయోగించార. దీని టాప్ స్పీడ్  గంటకు 24.9 కిలోమీటర్లు.

దీనిలో  రీప్లేస్ చేయగల బ్యాటరీ ఉంది అండ్  రీప్లేస్ చేయడానికి 1 నిమిషం మాత్రమే పడుతుంది.   ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అండ్ వెనుక వైపున స్ప్రింగ్ కాయిల్ సస్పెన్షన్ ఉంటుంది. రెండు వీల్స్ కి 110 ఎంఎం డ్రమ్ బ్రేక్లులు ఉంటాయి.
 

ఈ స్కూటర్  దేశంలోనే మొట్టమొదటి కీలెస్ ఎలక్ట్రిక్ స్కూటర్. అంటే దీన్ని స్టార్ట్ చేయడానికి మీకు కీ అవసరం లేదు. అదనపు ప్రత్యేకత ఏమిటంటే, మీరు దీన్ని యాప్ ద్వారా స్టార్ట్  చేయవచ్చు.
 

click me!