నింజా 500ని చూస్తే దాని ముఖ్యమైన ఫీచర్లు 451cc, పారలెల్-ట్విన్ ఇంజన్ మొదటి ఆకర్షణను పొందుతాయి. ఈ బైక్ 9,000rpm వద్ద 45.4bhp, 6,000rpm వద్ద 42.6Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడుతుంది. అసిస్ట్ అండ్ స్లిప్ క్లచ్ కూడ ఉంది. ఈ బైక్ నింజా 400 ఇంజన్ కంటే మెరుగైనది. కవాసకి కొత్త నింజా 500లో టార్క్ అందించడానికి కొత్త ఇంజన్ ట్యూన్ చేయబడిందని పేర్కొంది.