ఫిబ్రవరిలో కార్ కొనేవారికి మెగా జాక్‌పాట్.. సెలెరియో నుంచి స్విఫ్ట్ వరకు..

First Published | Feb 8, 2024, 11:20 PM IST

మీరు ఫిబ్రవరిలో కొత్త కారును కొనాలని  ప్లాన్ చేస్తున్నట్లయితే మీరు మారుతి సుజుకి  హ్యాచ్‌బ్యాక్ మోడల్‌లపై బంపర్ తగ్గింపును పొందవచ్చు.
 

కస్టమర్లను ఆకర్షించడానికి ఆటో కంపెనీలు ప్రతి నెలా గొప్ప ఆఫర్లను అందిస్తాయి, మీరు ఫిబ్రవరిలో కొత్త కారును కొనాలని  అనుకుంటే  మీరు మారుతి సుజుకి వాహనాలపై బంపర్ తగ్గింపును పొందవచ్చు. మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ వాహనాలు ఈ నెలలో రూ.62,000 వరకు భారీ తగ్గింపులతో విక్రయించబడుతున్నాయి.

డిస్కౌంట్‌లలో ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, క్యాష్‌బ్యాక్ అండ్ కార్పొరేట్ డిస్కౌంట్‌లు వంటి బెనిఫిట్స్ ఉన్నాయని గుర్తుంచుకోండి. కొత్త మారుతీ కారును కొనుగోలు చేసే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, డిస్కౌంట్ మొత్తం రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అంతే కాకుండా, మీరు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే డిస్కౌంట్   అఫర్ బెనిఫిట్స్ పొందుతారు.


మారుతి ఆల్టో K10 
మీరు ఈ హ్యాచ్‌బ్యాక్    అన్ని పెట్రోల్ వేరియంట్‌లపై రూ. 62 వేల వరకు తగ్గింపును పొందుతారు. ఇందులో  కార్పొరేట్ డిస్కౌంట్ సహా ఇతర బెనిఫిట్స్  ఉన్నాయి. మీరు సెలెరియోని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, ఫిబ్రవరిలో ఈ కారుపై రూ. 61 వేల వరకు ఆదా చేసుకోవచ్చు.

ఇందులో రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్, రూ. 40,000 వరకు క్యాష్‌బ్యాక్ అండ్ రూ. 6,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి   ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ మోడల్  స్విఫ్ట్ పై రూ. 42,000 వరకు తగ్గింపును పొందవచ్చు, ఇందులో రూ. 20,000 వరకు ఎక్స్చేంజ్, రూ. 15,000 వరకు క్యాష్‌బ్యాక్ అండ్  రూ. 7,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్స్  ఉన్నాయి.
 

మారుతి స్విఫ్ట్ డిజైర్ ఈ నెలలో రూ. 37,000 వరకు తగ్గింపును పొందుతోంది, ఇందులో రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్, రూ. 15,000 వరకు క్యాష్‌బ్యాక్ అండ్  రూ. 7,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. మారుతి S ప్రెస్సో  AMT మోడల్ ధర  పై రూ.61 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ.40వేల వరకు క్యాష్‌బ్యాక్ అండ్ రూ.6వేల వరకు కార్పొరేట్ తగ్గింపు సహా ఇతర బెనిఫిట్స్ ఉన్నాయి.
 

Latest Videos

click me!