వన్ డే వరల్డ్ కప్ క్రికెట్ కోసం స్పెషల్ ఎడిషన్ కారు.. అతి తక్కువ ధరకే బుక్ చేసుకోవచ్చు !

First Published Sep 15, 2023, 6:41 PM IST

ICC వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 అఫీషియల్  పార్ట్నర్  నిస్సాన్ తాజాగా  స్పెషల్ ఎడిషన్ కారును పరిచయం చేసింది. నిస్సాన్ కంపెనీ అత్యంత డిమాండ్ ఉన్న మాగ్నెట్ కారు స్పెషల్ ఎడిషన్ గ్లిఫ్స్ చూడవచ్చు. నిస్సాన్ మోటార్ ఇండియా (NMIPL) ఈ ప్రత్యేక ఎడిషన్ కారు బుకింగ్‌లను కూడా  ప్రారంభించింది. జపనీస్ లాంగ్వేజ్ నుండి ఉద్భవించిన KURO అనే పేరు ప్రత్యేక ఎడిషన్ ని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.  
 

నిస్సాన్ మాగ్నైట్ KURO స్పెషల్ ఎడిషన్ ఇప్పటికే పండుగ జోష్ ని పెంచింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ కార్ అక్టోబర్ 2023లో అధికారికంగా ప్రారంభించబడుతుంది. ఈ సందర్భంగా దాని ధర కూడా ప్రకటించబడుతుంది. అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అలాగే మాగ్నెట్ XV MT, Magnet Turbo XV MT అండ్ Magnet Turbo XV CVTతో సహా అన్ని టాప్-ఎండ్ కార్లను రూ.11,000 చెల్లించి ప్రీ-బుక్ చేయవచ్చు.
 

ఈ నిస్సాన్ మాగ్నైట్ KURO స్పెషల్ ఎడిషన్ ఆకర్షణీయమైన ఆల్-బ్లాక్ ఎక్స్‌టీరియర్ అండ్  ఇంటీరియర్‌తో వస్తుంది అలాగే కస్టమర్ ఫేవరెట్‌గా మారనుంది. ఈ కార్ ప్రీమియం లుక్‌తో స్టైలిష్‌గా ఉంటుంది. ఆకట్టుకునే అండ్ బోల్డ్ డిజైన్‌తో కారు వెలుపలి భాగం బ్లాక్ గ్రిల్, స్కిడ్ ప్లేట్, రూఫ్ రెయిల్‌లు, బ్లాక్ అల్లాయ్‌లు, బ్లాక్ ఫినిషర్‌తో కూడిన హెడ్‌ల్యాంప్‌లు అండ్ ప్రత్యేకమైన బ్యాడ్జ్‌తో బ్యూటీగా  పాలిష్ చేయబడింది.

అంతేకాకుండా Magnite KURO స్పెషల్ ఎడిషన్ ప్రీమియం గ్లాస్ బ్లాక్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, బ్లాక్ ఇంటీరియర్ యాక్సెంట్‌లు, బ్లాక్ డోర్ ట్రిమ్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ప్రత్యేకమైన ఇంటీరియర్‌ అందించారు. ఈ ఫీచర్లు అద్భుతమైన డిజైన్ ఎలిమెంట్‌లను మరింత మెరుగుపరుస్తాయి ఇంకా కస్టమర్‌ నుండి  ప్రశంసించబడటం ఖాయం. ఈ ప్రత్యేక ఎడిషన్‌లో 360 డిగ్రీ ఎరౌండ్ వ్యూ మానిటర్ (AVM), విశాలమైన IRVM,  ఫ్లోర్ మ్యాట్‌లతో కూడిన సెంటర్ కన్సోల్ ఆర్మ్‌రెస్ట్ అండ్ అలాగే  మరింత సౌలభ్యం అండ్  స్టైల్ కోసం వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఎన్నో ఉన్నత స్థాయి ఫీచర్లు ఉన్నాయి.
 

నిస్సాన్ మాగ్నైట్ గ్లోబల్ NCAP నుండి అడల్ట్ ఆక్యుపెంట్ సేఫ్టీ  రేటింగ్‌లో 4 స్టార్‌లను పొందింది, అద్భుతమైన సేఫ్టీ  ప్రమాణాలను అందిస్తోంది.  నిస్సాన్ ఎక్స్ట్రా సేఫ్టీ ఫీచర్లను పరిచయం చేయడం ద్వారా మాగ్నైట్‌ను అప్‌గ్రేడ్ చేసింది. 


సేఫ్టీ  ఫీచర్స్ :

 ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP)
· ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS)
· హిల్ స్టార్ట్ అసిస్ట్ (HAS)
· టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)

click me!