ఇండియాలో తక్కువ ధరలకు లభించే బెస్ట్ 5 బైక్స్ ఇవే.. గొప్ప మైలేజ్, తక్కువ మెంటేనన్స్ కూడా.. !!

First Published Sep 13, 2023, 3:33 PM IST

భారతదేశంలోని టాప్ 5 బడ్జెట్  బైక్స్  వాటి ధర,  మైలేజ్, ప్రత్యేక ఫీచర్ల కారణంగా ఇప్పటికి ప్రజలు ఇష్టపడే పాపులర్ బైక్స్ గా కొనసాగుతున్నాయి. ఈ బైక్స్ బడ్జెట్ ధరకే ఎక్కువ మైలేజ్ తో స్టాండర్డ్ ఫీచర్స్ తో వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బైక్స్ దేశంలోని అన్ని నగరాలలో  అందుబాటులో ఉన్నాయి. 
 

బజాజ్ ప్లాటినా 100 అనేది బజాజ్ అత్యంత బడ్జెట్ బైక్. ఈ బజాజ్ బైక్ సిగ్నేచర్ TDS-I టెక్నాలజీతో 102cc ఇంజన్ ఆధారంగా శక్తిని పొందుతుంది. ఈ బైక్  ఫ్యూయల్-ఇంజెక్షన్ పొందని ఏకైక బైక్. ఫ్యూయల్-ఇంజెక్షన్ కాకూండా బజాజ్ ఇ-కార్బ్‌ని ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 7.9hp, 8.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ విభాగంలో ప్లాటినా ప్రత్యేక ఫీచర్ LED DRL పొందుతుంది. దీని ధర రూ.67,475.
 

హోండా షైన్ 100 ఒక గొప్ప బైక్. దీనికి  ఆటో చోక్ సిస్టమ్ అండ్  సైడ్ ఇంజిన్ కట్-ఆఫ్ వంటి స్విచ్ ఉంది. ఇప్పటివరకు ఈ లిస్ట్ లో  ఉన్న ఏకైక OBD-2A కంప్లైంట్ అండ్  E20 కంప్లైంట్ బైక్ ఈ బైక్ మాత్రమే.  ఎలక్ట్రిక్ స్టార్ట్ తో 7.61hp, 8.05Nm టార్క్, 99.7cc ఇంజన్‌ ఈ బైకులో ఉంది. దీని ధర రూ.64,900.
 

TVS స్పోర్ట్ ఇండియాలో మూడవ అత్యంత బడ్జెట్ బైక్. ఈ బైక్ 8.3 హెచ్‌పి అండ్  8.7 ఎన్ఎమ్‌ టార్క్ అందిస్తుంది. దీని ధర రూ.61,500 నుండి రూ.69,873 మధ్య ఉంటుంది.
 

Hero MotoCorp హీరో  HF డీలక్స్ 100cc  విభాగంలో తిరుగులేని మార్కెట్ లీడర్. ఇప్పుడు హీరో HF డీలక్స్  i3S స్టాప్-స్టార్ట్ టెక్నాలజీతో వస్తుంది. TVS స్పోర్ట్ లాగా లో వేరియంట్‌లు కూడా కిక్ స్టార్ట్ పొందుతాయి. దీని ధర రూ.61,232 నుండి రూ.68,382 వరకు ఉంటుంది.
 

హీరో హెచ్‌ఎఫ్ 100 ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న అత్యంత బడ్జెట్ బైక్.  8hp అండ్ 8.05Nmతో  HF డీలక్స్ లాగే   97cc ఇంజిన్‌ దీనిలో ఉంది. దీని ధర రూ.54,962.

ఈ బైక్స్ ధరలు అన్ని ఎక్స్-షో రూమ్ కి చెందినవి. 

click me!