కొత్త టయోటా కరోలా క్రాస్ SUV
మీడియా నివేదికల ప్రకారం, టయోటా కరోలా క్రాస్ ఆధారంగా కొత్త ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టయోటా పాపులర్ MPV ఇన్నోవా హైక్రాస్ TNGA-C ప్లాట్‌ఫారమ్ అండ్ పవర్‌ట్రెయిన్‌పై ఆధారపడి ఉంటుంది. ఇంకా బిగ్ క్యాబిన్ స్థలాన్ని పొందుతుంది. దీని వీల్ బేస్ 2,640ఎంఎం. హై క్రాస్ లాగా కంపెనీ ఈ కారులో ఫ్లాట్-ఫోల్డ్ థర్డ్ రో సీట్లు అలాగే ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ టెయిల్‌గేట్‌ను అందించగలదు. ఇన్నోవా హైక్రాస్‌కు భిన్నమైన డిజైన్‌తో ఉంటుంది. దీనితో పాటు 2.0L పెట్రోల్ అండ్ 2.0L స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ అప్షన్స్ ఉంటాయి.