యూరోప్ అతిపెద్ద మోటార్ షోలో ఎలక్ట్రిక్ కార్ల హవా.. ఈ ప్రత్యేకమైన కార్ల గురించి తెలుసుకోండి..

First Published Sep 7, 2021, 3:36 PM IST

యూరోప్ అతిపెద్ద మోటార్ షోని ఈ సారి మునిచ్‌లో నిర్వహించనున్నారు, ఇక్కడ అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన సరికొత్త టెక్నాలజీ, ఫీచర్లు కలిగిన కార్లను ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రత్యేక కార్లలో కొన్ని కార్లు అందరి దృష్టిని ఆకర్షించాయి. అలాగే ఈ కార్ల టెక్నాలజీ భవిష్యత్తులో ఆటోమోబైల్ మార్కెట్‌ని మార్చగలవు. ఈ ప్రత్యేకమైన కార్ల గురించి తెలుసుకోండి..
 

20 సంవత్సరాల తర్వాత రానున్న  హ్యాచ్‌బ్యాక్ కార్లు

బి‌ఎం‌డబల్యూ ఐ -విజన్ సర్క్యులర్ అనే కాన్సెప్ట్ హ్యాచ్‌బ్యాక్ కారును చూపించింది, ఈ కారును 2040 సంవత్సరం నాటికి భారతీయ రోడ్లపై చూడవచ్చు. దీని ఫీచర్స్, తయారీ  100% రీసైకిల్ చేసిన పదార్థాల నుండి తయారు చేయనున్నారు.
 

710 బిహెచ్‌పి పవర్ ఎలక్ట్రిక్‌

లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి స్పియర్ అనే కాన్సెప్ట్ కారును పరిచయం చేసింది, దీనిలోని గ్రాండ్‌స్పియర్ పూర్తిగా ఎలక్ట్రిక్. ఈ 710 బిహెచ్‌పి కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 740 కిమీ ప్రయాణిస్తుంది. ఈ కారు లోపలి భాగం రీసైకిల్ చేసిన పదార్థలతో తయారు చేసారు.

హైబ్రిడ్ పెట్రోల్ కార్స్

కొరియన్  కంపెనీ కియా  స్పోర్టేజ్ కారులో 90 బిహెచ్‌పి శక్తినిచ్చే ఎలక్ట్రిక్ మోటార్, 116-లీటర్ టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అందించారు.

మెర్సిడెస్ బెంజ్ ఐదు పూర్తి ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసింది. వీటిలో మెర్సిడెస్ ఈ‌క్యూ‌ఈ 2022లో మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 660 కి.మీల దూరాన్ని 288 బిహెచ్‌పితో అధిగమించే సామర్ధ్యం ఉంది.
 

ఫ్యామిలీ కార్ కొత్త లుక్ లో

రెనాల్ట్ 100% ఇ-కార్ మెగానే ఇ-టెక్ ఫ్యామిలీ కార్ ఎలక్ట్రిక్ వెర్షన్ ని కొత్త అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. వోక్స్వ్యాగన్ కొత్త ఐ‌డి లైఫ్ లుక్  కోసం రూఫ్ అండ్  బోనెట్ ని ప్లాస్టిక్ బాటిల్స్ తో తయారు చేశారు. అంటే 2025 నుండి తయారు చేయబోయే ఈ కారు పైకప్పు, బోనెట్ ప్లాస్టిక్ బాటిల్స్ తో రూపొందించి ఉంటుంది.

click me!