ఉత్పాదక వ్యయాలు అధికంగా ఉన్నందున ఎంపిక చేసిన ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతామని గత నెల ఆగస్టు 30న సంస్థ ప్రకటించింది. దాని ఆధారంగా కంపెనీ తాజా ప్రకటన వచ్చింది. ఈ ఏడాది అంటే 2021లో మారుతి సుజుకి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచడం మూడోసారి.
ఈ సంవత్సరం ప్రారంభంలో జనవరి నుండి ఏప్రిల్‌లో మారుతి సుజుకి ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి పదార్థాల ధరలో నిరంతర పెరుగుదల కారణంగా భారతదేశంలో అతిపెద్ద కార్ బ్రాండ్ మారుతి సుజుకి కార్ల ధరలలో మరోసారి పెరుగుదల నమోదైంది.
గత నెలలో ధరల పెరుగుదలను ప్రకటించిన మారుతి సుజుకి ఒక ప్రకటనలో గత ఒక సంవత్సర కాలంలో వాహనాల తయారీదారుల ధర వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వల్ల ప్రతికూలంగా ప్రభావితమైందని తెలిపింది. ధరల పెరుగుదల వినియోగదారులపై అదనపు వ్యయం కొంత ప్రభావం చూపుతుందని పేర్కొంది.
జనవరి 2021లో మారుతి సుజుకి కొన్ని కార్ల ధరలను రూ .34,000 వరకు పెంచింది. ఏప్రిల్‌లో మళ్లీ కార్ల ధరలను 1.6 శాతం పెంచింది. రానున్న పండగ సీజన్‌కు ముందుగానే తాజా ధరల పెంపుదల జరిగింది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభం, ఆకాశాన్నంటిన ఇంధన ధరల మధ్య వాహనాల ధరల పెరుగుదల పండుగ సీజన్‌లో వాహన తయారీదారుల అమ్మకాలను ప్రభావితం చేయవచ్చు.
వాహనాల ధరలను పెంచిన ఏకైక కార్ బ్రాండ్ మారుతి సుజుకి మాత్రమే కాదు. గత నెలలో టాటా మోటార్స్, హోండా కార్స్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్, వోక్స్వ్యాగన్ ఇండియా వంటి ఇతర వాహన తయారీ సంస్థాలు కూడా ప్యాసింజర్ వాహనాల ధరల పెంపును ప్రకటించాయి. ద్విచక్ర వాహన విభాగంలో కూడా చాలా వరకు ఆటో కంపెనీలు ద్విచక్ర వాహనాల ధరలను పెంచాయి.
శశాంక్ శ్రీవాస్తవ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్), మారుతి సుజుకి ఇండియా మాట్లాడుతూ ఈ సంవత్సరం మే-జూన్‌లో ఉక్కు ధరలు గత ఏడాది కిలోకు రూ. 38 నుండి కిలోకు రూ. 65 కి పెరిగాయని అన్నారు. అదేవిధంగా రాగి ధరలు టన్ను US $ 5,200 నుండి $ 10,000కి రెట్టింపు అయ్యాయి. దీనితో పాటుగా రోడియం వంటి విలువైన లోహాల ధరలు మే 2020లో రూ .18,000 నుండి జూలైలో రూ. 64,300 వరకు పెరిగాయని తెలిపారు. ఈ కారణంగా కార్ల ధరలను పెంచడం తప్పనిసరి అయ్యింది అని వెల్లడించారు.