మరోవైపు, మహీంద్రా సంస్థ తాజాగా విడుదల చేసిన ఎక్స్‌యూవి700 5-సీటర్ ఎస్‌యూవి ధరలను ప్రకటించింది. ఈ ఎస్‌యూవి 7-సీటర్ వెర్షన్ అక్టోబర్ 2021లో షోరూమ్‌లలోకి రానుంది. పూణేకి చెందిన కార్ల తయారీ సంస్థ మహీంద్రా నెక్స్ట్ జనరేషన్ మోడల్ స్కార్పియోను విడుదల చేయనుంది. అయితే టాటా నుండి మహీంద్రా వరకు లాంచ్ కానున్న కార్ల వివరాలు మీకోసం..
త్వరలో రానున్న టాటా పంచ్ మినీ ఎస్‌యూవీ కంపెనీ అధికారిక ఫోటోల ద్వారా వెల్లడించింది. దీనిని 2020 ఆటో ఎక్స్‌పోలో మొదటగా పరిచయం చేసిన్ హెచ్‌బిఎక్స్ కాన్సెప్ట్‌పై ఆధారపడుతుంది. ప్రొడక్షన్ మోడల్‌లో ప్రవేశపెట్టిన టాటా పంచ్ కాన్సెప్ట్ మోడల్‌కి పెద్దగా తేడా లేదు. కాన్సెప్ట్ మోడల్‌తో పోలిస్తే ఫ్రంట్ బంపర్, బాడీ క్లాడింగ్ ప్రొడక్షన్ వెర్షన్ నుండి టోన్ చేసినప్పటికీ స్క్వేర్ వీల్ ఆర్చ్‌లు, స్టాన్స్ ఎస్‌యూవి లాంటి రూపాన్ని ఇస్తాయి. డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ పెయింట్ ఆప్షన్ కూడా కారు పైకప్పుకు మెరుగైన ఫ్లోటింగ్ ప్రభావాన్ని ఇస్తుంది. పంచ్ ఎస్‌యూవికి స్టైలిష్ 16-అంగుళాల వీల్స్ ఇచ్చారు. కారు ఇంటీరియర్, ఫీచర్లు కాన్సెప్ట్ మోడల్‌కి దగ్గరగా ఉంటాయి, డాష్‌బోర్డ్ డిజైన్‌కి 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్క్వేర్ష్ ఎయిర్ కాన్వెంట్ లభిస్తాయి.