వాహనదారులకు అలెర్ట్: హెల్మెట్లపై కొత్త నిబంధనలు.. పాటించకపోతే జరిమానాతో పాటు జైలు శిక్ష..

First Published | Jun 7, 2021, 11:30 AM IST

 దేశవ్యాప్తంగా ఐఎస్ఐ స్టాండర్డ్ లేని హెల్మెట్ల వాడకం 1 జూన్ 2021 నుండి పూర్తిగా నిషేధించింది. ఐఎస్ఐ కాని గుర్తును కలిగి ఉన్న హెల్మెట్లను ఎవరైనా విక్రయిస్తే లేదా కొనుగోలు చేస్తే వారు చట్టపరమైన చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో మీరు కొనుగోలు చేసే హెల్మెట్‌ను రెండుసార్లు తనిఖీ చేయాలి. 

ఇంకా అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఐ‌ఎస్‌ఐ సర్టిఫికేట్ తప్పనిసరి. 1 జూన్ 2021 నుండి ద్విచక్ర వాహనదారులకు, బైక్ రైడర్లకు ఐఎస్ఐ గుర్తు ఉన్న హెల్మెట్లను మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. ఈ హెల్మెట్ బి‌ఐ‌ఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
కొత్త నియమం ఏమిటి26 నవంబర్ 2020న రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జారీ చేసిన ప్రకారం జూన్ 1 నుండి హెల్మెట్లపై ఇండియన్ స్టాండర్డ్ (ఐ‌ఎస్‌ఐ) గుర్తు తప్పనిసరి ఉండాలి.

కొనుగోలుదారులు, అమ్మకందారులపై జరిమానాలుఈ కొత్త చట్టాన్ని పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిని శిక్షించాలని కూడా నిర్ణయించారు. ఐఎస్ఐ లాంటి హెల్మెట్లను తయారుచేసే, విక్రయించే లేదా దిగుమతి చేసుకునే వ్యక్తికి ఐదు లక్షల వరకు జరిమానాతో జైలు శిక్ష కూడా శిక్షించబడుతుంది.
అంతే కాకుండా బిఐఎస్ ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉన్న ద్విచక్ర వాహన హెల్మెట్లను మాత్రమే దేశంలో విక్రయించడానికి అనుమతించింది. అంటే ఐఎస్ఐ లాంటి హెల్మెట్లు తయారు చేయడం లేదా అమ్మడం ఇప్పుడు నేరం. దీనిని ఉల్లంఘించడం కూడా జైలు శిక్షకు దారితీస్తుంది. నకిలీ ద్విచక్ర వాహన హెల్మెట్ల అమ్మకాలను నిషేదించడం, తక్కువ నాణ్యత గల హెల్మెట్ల వల్ల రహదారిపై ప్రమాదాల సంఖ్యను తగ్గించడం కోసమే భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యకు కారణం.
డబల్యూ‌హెచ్‌ఓ నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం 3 లక్షలకు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఇవి భారత ప్రభుత్వం నివేదించిన, నమోదు చేసిన గణాంకాలు మాత్రమే ఉన్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఈ నియమాన్ని పాటించని వారు కఠినమైన చట్టపరమైన చర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఐఎస్‌ఐ గుర్తు లేని హెల్మెట్‌లను నిషేధించే లక్ష్యంగా రోడ్డు పక్కన విక్రయించే స్టాండర్డ్ లేని హెల్మెట్ల అమ్మకాలను నివారిస్తుంది. రోడ్డు ప్రమాదంలో గాయాల నుండి డ్రైవర్ లేదా ప్రయాణికుడిని రక్షించడానికి తక్కువ నాణ్యత గల హెల్మెట్లు సహాయపడవు. ఇటువంటి నకిలీ హెల్మెట్లను సాధారణంగా పోలీసుల చలాన్ల నుండి తప్పించుకోవడానికి కొనుగోలు చేస్తారు. కాబట్టి మీరు కొత్త హెల్మెట్ కొనే ముందు ఐ‌ఎస్‌ఐ ఇంకా బి‌ఎస్‌ఐ సర్టిఫికేట్ ఉండేల నిర్ధారించుకోండి.

Latest Videos

click me!