ఎంజీ మోటార్స్ కార్లపై రూ.5.5 లక్షల తగ్గింపు: ఆఫర్లు కొద్దిరోజులే..

ఎంజీ మోటార్స్ : హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్.. తన అన్నిరకాల మోడళ్లపై రాయితీలు ప్రకటించింది. ఇవన్నీ మార్చి నెలాఖరు వరకు అందుబాటులో ఉంటాయి. కొత్త కార్ కొనాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. JSW MG మోటార్స్ కంపెనీ తమ 5 కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. దీని ద్వారా మీరు రూ.5.5 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ ఉందో తెలుసుకోండి.

కామెట్ కారుపై రూ.45వేలు తగ్గింపు

ఎంజీ మోటార్స్ యొక్క చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీని కొనడానికి ఇది ఒక మంచి అవకాశం. మార్చి 2025లో రూ.45,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎంజీ మోటార్స్ మిడ్ సైజ్ ఎస్‌యూవీ ఆస్టర్ ఎన్నో ప్రత్యేకతలు కలిగినది. మార్చి 2025లో ఈ కారును కొంటే 1.45 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

MG ZS EV

హోలీలో MG ZS EV కి కూడా డిస్కౌంట్ ఉంది. ఎంజీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును మార్చి 2025లో 2.05 లక్షల వరకు డిస్కౌంట్‌లో పొందవచ్చు. ఎంజీ మోటార్ ఇండియా హెక్టర్ ఎస్‌యూవీకి డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలలో ఈ కారును కొంటే 2.20 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.


MG Gloster రూ.5.5లక్షలు డిస్కౌంట్

ఎంజీ మోటార్ కంపెనీ గ్లోస్టర్ ఎస్‌యూవీకి ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. మార్చి 2025 వరకు 5.50 లక్షల వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Latest Videos

click me!