త్వరలో లాంచ్ కానున్న మారుతి కొత్త కార్లు ఇవే.. ధర రూ .3 లక్షల నుంచి ప్రారంభం..

First Published | Jul 21, 2021, 7:11 PM IST

దేశంలోని అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి భారత మార్కెట్లో  వాహన శ్రేణిని బలోపేతం చేయడానికి సన్నాహాలు చేస్తోంది. సంస్థ త్వరలో వాహన పోర్ట్‌ఫోలియోను దేశీయ మార్కెట్లో విస్తరించనుంది. కంపెనీ కొన్ని మోడళ్లను అప్‌డేట్స్‌తో తీసుకువస్తుండగా, కొన్ని కొత్త మోడళ్లను కూడా లాంచ్ చేయవచ్చు. 

కొంతకాలంగా కంపెనీ కొత్త వాహనాలను పరీక్షిస్తోంది. నివేదిక ప్రకారం, మారుతి ఎంట్రీ లెవల్ కారు ఆల్టో నుండి అత్యధికంగా అమ్ముడైన స్విఫ్ట్ డిజైర్ సెడాన్ కారు సిఎన్జి మోడల్ వరకు పలు కార్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సుజుకి రాబోయే కార్ల గురించి తెలుసుకోండి...
మారుతి ఆల్టోమారుతి సుజుకి చౌకైన అండ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు కొత్త జనరేషన్ మోడల్‌ను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి కొత్త ఆల్టో సంస్థ కొత్త హియర్టెక్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుంది.ఎస్-ప్రెస్సో 'మైక్రో-ఎస్‌యూవీ'లో కూడా హియర్‌టెక్ ప్లాట్‌ఫాం ఉపయోగించారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ప్రత్యేకత ఏమిటంటే కారుకు బలాన్ని ఇవ్వడమే కాకుండా, కారు బరువును తేలికగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. నివేదిక ప్రకారం, ఆల్టో నెక్స్ట్ జనరేషన్ మోడల్ పాత మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. అంటే, కొత్త ఆల్టో కారు లోపల ఎక్కువ స్థలం లభిస్తుంది. ఇంజిన్ స్పెసిఫికేషన్ల గురించి మాట్లాడితే ప్రస్తుత మోడల్ లాగానే 0.8-లీటర్ ఇంజిన్‌ను పొందవచ్చు. ఈ ఇంజిన్ 48 పిఎస్ శక్తిని, 69 ఎన్ఎమ్ పీక్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

మారుతి సెలెరియోమారుతి సుజుకి పాపులర్ హ్యాచ్‌బ్యాక్ కారు సెలెరియో కొత్త జనరేషన్ మోడల్‌ను కూడా అతి త్వరలో విడుదల చేయబోతోంది. నివేదిక ప్రకారం, రాబోయే ఒకటి లేదా రెండు నెలల్లో కొత్త సెలెరియోను విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. అయితే, కారు అధికారికంగా ప్రారంభించటానికి ముందు, కొత్త మోడల్ ప్రీ-బుకింగ్స్ ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే ప్రారంభమయ్యాయి. వివిధ నగరాల ప్రకారం టోకెన్ మొత్తాన్ని రూ .5 వేల నుండి 11 వేల వరకు వినియోగదారుల నుండి తీసుకుంటున్నారు. ఒకవేళ బుకింగ్ రద్దు చేసిన తర్వాత కూడా డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది. 2021 మారుతి సెలెరియో లీక్ అయిన పేటెంట్ ఫోటోలు హ్యాచ్‌బ్యాక్ పాత మోడల్ కంటే పెద్దదిగా ఉంటుందని, కొన్ని ముఖ్యమైన అప్ డేట్స్ చూస్తారని వెల్లడించింది.
ఇంజన్ అండ్ ఫీచర్స్కొత్త-జెన్ సెలెరియో 2021 మోడల్‌ను 1.0-లీటర్, 3-సిలిండర్ కె10బి పెట్రోల్ ఇంజన్ ద్వారా బిఎస్- VI ఇంధన ఉద్గారంతో వస్తుంది. ప్రస్తుత ఇంజన్ సెలెరియోలో కూడా పాత మోడల్ లో కూడా ఉపయోగించారు. ఈ ఇంజన్ 66 బిహెచ్‌పి శక్తిని, 90 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమాటిక్ 5-స్పీడ్ ఏ‌ఎం‌టి గేర్‌బాక్స్ పొందవచ్చు. సెలెరియో కొత్త మోడల్ పాత కంటే ఎక్కువ మైలేజీని ఇస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌ను పెట్రోల్ ఇంకా సిఎన్‌జి కిట్ కాంబోతో కూడా అందించవచ్చు. లోపలి భాగంలో చాలా మార్పులు కనిపిస్తాయి. అతిపెద్ద మార్పు ఏమిటంటే దీనికి మారుతి సుజుకి స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. అలాగే ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేస్తుంది. అయితే సంస్థ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
మారుతి డిజైర్ సిఎన్‌జిమారుతి సుజుకి త్వరలో సిఎన్‌జి వేరియంట్లో అత్యధికంగా అమ్ముడైన కారు మారుతి డిజైర్ ను విడుదల చేయనుంది. మారుతి డిజైర్ సిఎన్‌జి కారును భారతీయ రోడ్లపై కూడా పరీక్షించారు. గత ఏడాది 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్- VI ఇంధన ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చిన తరువాత మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ డీజిల్ ఇంజన్‌ను నిలిపివేసింది. మారుతి సుజుకి డీజిల్ ఇంజన్‌ను నిలిపివేయడం వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ ఇంధన ఆప్షన్స్ పరిశీలిస్తోంది.ఢీల్లీ ఎక్స్ షోరూంలో మారుతి సుజుకి డిజైర్ ధర రూ .5,98,000. మారుతి డిజైర్‌కు 24 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల సామర్థ్యం ఉందని కంపెనీ పేర్కొంది.
మారుతి సుజుకి వాహన పోర్ట్‌ఫోలియోలో చాలా సిఎన్‌జి కార్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు కంపెనీ సిఎన్‌జి లైనప్‌ను విస్తరించే దిశగా కృషి చేస్తోంది. మారుతి ప్రస్తుతం 6 ప్యాసింజర్ వాహనాలను వాగన్ఆర్, సెలెరియో, ఎస్-ప్రెస్సో, ఎర్టిగా, ఆల్టో 800, ఈకో ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్‌జి కిట్‌లతో విక్రయిస్తోంది. ఎర్టిగా మినహా, సంస్థ చాలా సిఎన్‌జి మోడళ్లు కిలోకు 30 నుండి 32 కిమీ మైలేజీని ఇస్తాయి. డిజైర్ సిఎన్‌జి వేరియంట్ మైలేజ్ కూడా దీని బట్టి ఉంటుందని భావిస్తున్నారు.
మారుతి విటారా బ్రెజ్జామారుతి సుజుకి విటారా బ్రెజ్జా కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో బాగా ప్రాచుర్యం పొందిన కారు. మారుతి 2016 సంవత్సరంలో తొలిసారిగా బ్రెజ్జాను ప్రారంభించింది. ఆ తర్వాత ఫిబ్రవరి 2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో కొత్త ఇంధన ఉద్గార నిబంధనలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి కంపెనీ డీజిల్ వేరియంట్‌లను అప్ డేట్ చేయలేధు. ఇప్పుడు ఈ కారు పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అమ్ముడవుతోంది. నివేదిక ప్రకారం, ప్రస్తుతమున్న ఇంజన్, కొత్త చాసిస్ ఫ్రేమ్‌తో కంపెనీ పాపులర్ ఎస్‌యూవీని కొత్త అవతార్‌లో విడుదల చేయవచ్చు. అంతేకాకుండా, మారుతి కొత్త జనరేషన్ బ్రెజ్జాలో మైల్డ్ హైబ్రిడ్ వ్యవస్థను కూడా అందించగలదు, ఇది మైలేజీని పాత మోడల్ కంటే ఎక్కువగా చేస్తుంది. ప్రస్తుతం, సంస్థ దీని గురించి అధికారిక ప్రకటన చేయలేదు.

Latest Videos

click me!