ఇప్పుడు మరిన్ని ఆకర్షణీయమైన రంగులలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. కేవలం రూ.499 చెల్లిస్తే చాలు..

First Published Jul 21, 2021, 3:28 PM IST

ఇండియన్ మల్టీ నేషనల్ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్  ఇప్పుడు  మరిన్ని విభిన్న రంగులలో  రూ.499లకు మాత్రమే బుక్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ నుండి వస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ జూలై చివరి నాటికి భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ స్కూటర్  అధికారిక టీజర్ కూడా ఇప్పటికే విడుదలైంది. దీని ద్వారా ఓలా స్కూటర్ అధికారికంగా లాంచ్ ముందే ప్రజల ఆసక్తిని  మరింత పెంచింది.

ఓలా నుండి బ్యాటరీతో నడిచే ఈ కొత్త స్కూటర్ మల్టీ ఔటర్ కలర్ ఆప్షన్స్ తో భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. వీటిలో కొన్ని కలర్స్ ఇప్పటికే వెలువడ్డాయి. వీటిలో నలుపు, గులాబీ, నీలం, తెలుపు ఉన్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ఇటీవల సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది.లాంచ్ ముందే ముఖ్యాంశాలలో నిలిచిన ఈ స్కూటర్ కేవలం రూ.499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. జూలై 15 సాయంత్రం నుండి దీని బుకింగులు ప్రారంభించారు. ప్రత్యేక విషయం ఏమిటంటే, బుకింగ్ ప్రారంభించిన ఇరవై నాలుగు గంటల్లో కంపెనీకి లక్ష కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్‌లు వచ్చాయి. ఒకవేల కస్టమర్ బుకింగ్‌ను తరువాత రద్దు చేయాలనుకుంటే, అతని మొత్తం డబ్బు తిరిగి ఇవ్వబడుతుంది.
undefined
ఎలా బుక్ చేసుకోవాలిఓలా ఎలక్ట్రిక్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీని కోసం ఆసక్తిగల కస్టమర్లు మొదట వెబ్‌సైట్‌లో అక్కౌంట్ సృష్టించుకోవాలి. ఆ తర్వాత స్కూటర్‌ను బుక్ చేసుకోవచ్చు. దీనితో పాటు, మొదట బుక్ చేసుకునే కస్టమర్లకు స్కూటర్ డెలివరీలో ప్రాధాన్యత ఇస్తామని ఓలా ఎలక్ట్రిక్ తెలిపింది. ఓలా చైర్మన్ అండ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) భవష్ అగర్వాల్ ఒక ప్రకటనలో, "మా మొదటి ఇ-స్కూటర్ కోసం దేశవ్యాప్తంగా వినియోగదారుల నుండి మాకు లభించిన స్పందన చాలా ప్రోత్సాహకరంగా ఉంది"అని అన్నారు.
undefined
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పీడ్, మైలేజ్ అండ్ టెక్నాలజి పరంగా చాలా ముందుకు ఉంటుందని కంపెనీ పేర్కొంది. తాజాగా కంపెనీ సిఇఒ భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఓలా స్కూటర్‌కు అతిపెద్ద-ఇన్-క్లాస్ బూట్ స్పేస్, యాప్-బేస్డ్ కీలెస్ యాక్సెస్ అండ్ సెగ్మెంట్-లీడింగ్ రేంజ్ వంటి కొన్ని క్లాస్-లీడింగ్ ఫీచర్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఈ స్కూటర్ టెస్టింగ్ సమయంలో తీసిన ఫోటోల ప్రకారం, దీనికి డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, సింగిల్-పీస్ సీట్, ఎక్స్‌టర్నల్ ఛార్జింగ్ పోర్ట్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు, ఎల్‌ఇడి టైల్ లైట్, లగేజ్ హుక్, స్ప్లిట్-టైప్ రియర్ గ్రాబ్ హ్యాండిల్, కలర్ ఫ్లోర్ మాట్స్, ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను చూడవచ్చు.కంపెనీ స్కూటర్ ముఖ్యమైన ప్రత్యేకతలను ప్రకటించలేదు, కానీ భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నట్లుగా స్కూటర్ డెలివరీ టైమ్‌లైన్, స్పెసిఫికేషన్ల గురించి మరిన్ని వివరాలు, డ్రైవింగ్ రేంజ్, ఛార్జింగ్ సమయం త్వరలో వెల్లడించవచ్చు.
undefined
డ్రైవింగ్ రేంజ్ఓలా నుండి వస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటర్గో యాప్‌ స్కూటర్ ఆధారంగా ఉంటుంది. ఓలా క్యాబ్స్ నెదర్లాండ్స్‌కు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఎటర్గోను మే 2020లో కొనుగోలు చేసింది. స్కూటర్ స్వాప్ చేయగల అధిక శక్తి-సాంద్రత కలిగిన బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. సంస్థ ప్రకారం, ఒక ఫుల్ ఛార్జింగ్‌తో 240 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. ఎటర్గో యాప్‌ స్కూటర్ కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుండి 45 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సీటు కింద 50 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని పొందుతుంది.
undefined
కంపెనీ ఛార్జర్ నెట్‌వర్క్‌ఓలా స్కూటర్‌ను కేవలం 18 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. దీని తరువాత 75 కిలోమీటర్ల దూరం వరకు సులభంగా ప్రయాణించవచ్చు. ఓలా స్కూటర్ కొనుగోలుతో పాటు ఇంట్లో ఛార్జ్ చేయడానికి హోమ్-ఛార్జర్ యూనిట్ కూడా అందిస్తున్నారు.
undefined
రాబోయే కొద్ది రోజుల్లో ఈ స్కూటర్ మరిన్ని ఫీచర్లు, ధరల గురించి కంపెనీ సమాచారం తెలపనుంది. వాహన ధరను అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయిస్తామని, తద్వారా ఎక్కువ మంది ప్రజలు దీనిని కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్కూటర్‌ను తమిళనాడులోని కంపెనీ ఫ్యాక్టరీలో తయారు చేయనున్నారు. కంపెనీ ఫ్యాక్టరీ మొదటి దశ పూర్తయ్యే దశలో ఉంది.
undefined
click me!