పండుగ సీజన్ లో కార్ కొనేవారికి షాకింగ్ న్యూస్.. భారత కార్ల తయారీ సంస్థ కీలక నిర్ణయం..

First Published | Aug 30, 2021, 2:23 PM IST

ఇండియన్ ఆటోమోబైల్ మానుఫాక్చరర్ మారుతి సుజుకి ఇండియా సెప్టెంబర్ 2021 నుండి ఆన్ని మోడల్స్ లైనప్‌ ధరలను పెంచుతున్నట్లు  కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. ధరల పెరుగుదల ఎంత అనేది వెల్లడించనప్పటికీ ధరల పెరుగుదలకు ప్రధానంగా వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుదల కారణమని కంపెనీ పేర్కొంది. 

 2021-22 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (క్యూ 2) భారతదేశంలో కార్ల ధరలను పెంచనున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (బిఎస్‌ఇ) కు మారుతీ సుజుకి ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది.

మారుతి సుజుకి ఇండియా అధికారిక ప్రకటనలో, "ధరల పెరుగుదలకు సంబంధించి గతంలో చెప్పినట్లు  ప్రస్తావిస్తూ వివిధ ఇన్‌పుట్ ఖర్చులు పెరగడం వలన గత ఏడాది కాలంలో కంపెనీ వాహనాల ధర ప్రతికూలంగా ప్రభావితమవుతాయని వెల్లడిస్తున్నాము. అందువల్ల ధరల పెరుగుదల ద్వారా వినియోగదారులకు అదనపు ఖర్చు కొంత ప్రభావాన్ని చూపనుంది. ఈ ధరల పెరుగుదల సెప్టెంబర్ 2021 నుండి అన్నీ మోడళ్లకు వర్తిస్తుంది" అని పేర్కొంది.
 


మారుతి సుజుకి ఇండియా ఇప్పటికే స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్,  సి‌ఎన్‌జి మోడల్ లైనప్ ధరలను ప్రస్తుత త్రైమాసికంలో జూలై 2021లో పెంచింది. మోడల్ అండ్ వేరియంట్ ఆధారంగా కార్ల సంస్థ ధరలను 15,000 వరకు పెంచింది. అలాగే త్వరలో ఇతర పెట్రోల్ మోడల్స్ ధరను పెంచుతామని ప్రకటించింది. స్విఫ్ట్ అండ్ కంపెనీ సి‌ఎన్‌జి మోడళ్ల ధరలు మళ్లీ పెంచుతుంద లేదా అనేది అస్పష్టంగా ఉంది.
 

ఇండో-జపనీస్ కార్ల తయారీ సంస్థ ఈ ఏడాది కార్ల ధరలను పెంచడం మూడోసారి. ఇంతకుముందు జనవరి 2021లో కంపెనీ ఎంచుకున్న మోడళ్ల ధరలను రూ.34,000 వరకు పెంచింది, ఏప్రిల్ 2021లో మరోసారి పెంచింది. ఈ రెండు సందర్భాల్లో కార్ల తయారీ సంస్థ ధరల పెరుగుదలకు ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుదల పేర్కొంది.

Latest Videos

click me!