ఇప్పుడు మీ పాత స్కూటర్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చేయండి.. ఖర్చు కూడా చాలా తక్కువ..

First Published | Aug 28, 2021, 11:58 AM IST

 రోజురోజుకి పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా సాధారణ ప్రజలు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధనంపై నడుస్తున్న వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగా కొంతకాలంలో  వాహన తయారీ సంస్థలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను ద్విచక్ర వాహన విభాగంలో విడుదల చేశారు. 

ఇప్పటికే మార్కెట్లో చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ప్రస్తుతం, ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కానీ వాటిని నడపడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. దీర్ఘకాలంలో  ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ ఇంజన్ స్కూటర్ల కంటే చాలా చౌకగా ఉంటాయి. ఏదేమైనా ఇప్పటికే ద్విచక్ర వాహనాలు ఉన్నవారికి ఈ ఆలోచన ఖచ్చితంగా వారి మనసులోకి  వస్తుంది.  ప్రస్తుత పెట్రోల్ ఇంజిన్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చగలిగితే డబ్బు చాలా ఆదా చేస్తుంది.

బెంగుళూరులోని కొన్ని స్టార్టప్ కంపెనీలు ఇలాంటి ప్రత్యేకమైన చొరవను ప్రారంభించాయి. ఈ కంపెనీలు మీ పెట్రోల్ ఇంజిన్‌ ఏదైనా పాత స్కూటర్‌ను ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మారుస్తాయి. దీని కోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.  ఇది మాత్రమే కాదు మీ ప్రస్తుత స్కూటర్‌ను హైబ్రిడ్ స్కూటర్‌గా మార్చే ఆప్షన్ కూడా ఒక కంపెనీ ఇస్తోంది. 

బెంగుళూరులో రైడ్ షేరింగ్ సర్వీస్  స్టార్టప్ కంపెనీ అయిన బౌన్స్ అటువంటి అద్భుతమైన ప్లాన్‌ను ప్రారంభించింది. ఇంటర్నల్ కంబాషన్ ఇంజన్ (ICE) ఉన్న ఏదైనా పాత స్కూటర్‌ను ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీని అమర్చడం ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్‌గా కంపెనీ మారుస్తుంది. మీడియా నివేదికల ప్రకారం, ఈ సర్వీస్ కోసం కంపెనీ కేవలం రూ. 20,000 మాత్రమే వసూలు చేస్తుంది.


డిమాండ్

నివేదిక ప్రకారం కంపెనీ పాత స్కూటర్‌లో రెట్రోఫిట్ కన్వర్షన్ కిట్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్ అండ్ బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. స్టార్టప్ బౌన్స్ సహ వ్యవస్థాపకుడు వివేకానంద హల్లెకరే మాట్లాడుతూ, కంపెనీ ప్రారంభంలో పాత ట్రెడిషనల్ స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చడం ప్రారంభించిందని చెప్పారు. పెట్రోల్ ఇంజిన్ స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చాలనే డిమాండ్ పెరుగుతుండటంతో మార్కెట్ భారీగా ఉంటుందని  గ్రహించారు. 

డ్రైవింగ్ పరిధి

బౌన్స్ ప్రకారం కంపెనీ ఇప్పటివరకు 1000 కంటే ఎక్కువ పాత స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చారు. హల్లకెరె కంపెనీ  కన్వర్టెడ్ స్కూటర్ల కోసం ఒక సర్వీస్ సెంటర్‌ని తెరవాలనే ఆలోచనలో కూడా ఉందని చెప్పారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన బ్యాటరీ కిట్, ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే  65 కిమీల దూరాన్ని కవర్ చేయగలదని చెప్పారు. ఈ కిట్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సర్టిఫికేట్ పొందిందని ఆయన చెప్పారు.

ఈ కంపెనీలకు ఆప్షన్ కూడా ఉంది

పాత స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్‌లుగా మార్చడం వల్ల ప్రయోజనాలు జరుగుతున్నాయి, బౌన్స్ తర్వాత చాలా కంపెనీలు ఇప్పుడు ఈ రంగంలోకి ప్రవేశించాయి. ఎట్రియో అండ్ మేలదత్ ఆటోకంపొనెంట్ వంటి కంపెనీలు పాత స్కూటర్లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చే కిట్‌లను అందిస్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరలు నెమ్మదిగా ప్రపంచాన్ని ప్రత్యామ్నాయ ఇంధన ఆధారిత రవాణా వైపు మళ్ళిస్తున్నాయి. ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ అండ్  సింపుల్ ఎనర్జీ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేశాయి. అయితే అథర్, బజాజ్ ఆటో, టి‌వి‌ఎస్ వంటి వాహన తయారీదారులు ఇప్పటికే  ఇ-స్కూటర్లను విక్రయిస్తున్నారు. 
 

హైబ్రిడ్ స్కూటర్ ఆప్షన్

ఏదైనా పాత పెట్రోల్ స్కూటర్‌ను ఎలక్ట్రిక్ హైబ్రిడ్ స్కూటర్‌గా మార్చే ఈజీ హైబ్రిడ్ కిట్‌ను తీసుకురావడానికి మేలదత్ సిద్దంగా ఉంది. అంటే ఈ స్కూటర్‌ను పెట్రోల్ అండ్ బ్యాటరీ ఏ మోడ్‌లోనైనా అమలు చేయవచ్చు. బ్యాటరీ ఛార్జ్ అయిపోయినట్లయితే ఆందోళన చెందకుండా పెట్రోల్‌తో రన్ చేయవచ్చు. నివేదిక ప్రకారం, పాత పెట్రోల్ స్కూటర్‌ను హైబ్రిడ్ స్కూటర్‌గా మార్చడానికి మేలదత్ రూ. 40,000 వరకు ఛార్జ్ చేస్తుంది. 

Latest Videos

click me!