మహీంద్ర థార్ కి పోటీగా త్వరలో పవర్ ఫుల్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీ వచ్చేస్తోంది.. అడ్వెంచర్స్ రైడర్స్ కోసం స్పెషల్..

First Published Aug 28, 2021, 7:51 PM IST

ఇండియన్ మల్టీ నేషనల్ ఆటోమాటివ్ ఫోర్స్ మోటార్స్ త్వరలో  కొత్త ఆఫ్-రోడర్ ఎస్‌యూ‌వి గూర్ఖాను కొత్త లుక్ లో విడుదల చేయడానికి సిద్ధమైంది. సంస్థ  లాంచ్ పై సరికొత్త గుర్ఖా 4X4  టీజర్ ఫోటోని సోషల్ మీడియాలో విడుదల చేసింది. పండుగ సీజన్‌కు ముందు 2021 ఫోర్స్ గూర్ఖాను తీసురబోతున్నట్లు కంపెనీ ధృవీకరించింది. 

నివేదిక ప్రకారం 2021 ఫోర్స్ గూర్ఖా అధికారికంగా వచ్చే నెలలో లాంచ్ కావొచ్చు. అయితే కంపెనీ అధికారికంగా లాంచ్ తేదీని వెల్లడించలేదు. 

ఫోర్స్ మోటార్స్ గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2020లో కొత్త గూర్ఖా BS-6ని ఆవిషరించింది. అప్పటి నుండి అడ్వెంచర్ డ్రైవింగ్ ఔత్సాహికులు ఈ ఆఫ్-రోడర్ ఎస్‌యూ‌వి కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా కంపెనీ కొత్త గూర్ఖా ఎస్‌యూవీ విడుదల తేదీని వాయిదా వేసింది. మహీంద్రా థార్ భారతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందింది. దీనికి పోటీగా కంపెనీ కొత్త గూర్ఖా ఎస్‌యూవీ లుక్ అండ్ డిజైన్‌లో ఎన్నో మార్పులు చేసింది. ఈ కాస్మెటిక్ మార్పుల కారణంగా నెక్స్ట్ జనరేషన్  గూర్ఖా ప్రస్తుత మోడల్ కంటే మెరుగ్గా ఉంటుంది. 
 

శక్తివంతమైన ఇంజిన్

ఆఫ్-రోడర్ కొత్త ఫోర్స్ గుర్ఖా BS6 ఎస్‌యూ‌వికి 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ ఇచ్చారు, ఈ ఇంజన్ గరిష్టంగా 89 bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లభిస్తుంది. అడ్వెంచర్ ప్రియులను ఉత్తేజపరిచేందుకు ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ ఎస్‌యూ‌వి హై లెట్ లో ఒకటి ఇన్డిపెండెంట్  ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో దృఢమైన యాక్సిల్ స్ట్రాంగ్ ఆఫ్-రోడర్‌గా ఉంటుంది. 4x4 సిస్టమ్‌తో ఆఫ్రోడింగ్ టైర్‌లతో వస్తుంది, ఇంకా కఠినమైన భూభాగంలో కూడా దూసుకెళ్తుంది.  

గ్రేట్  లుక్స్

ఫోర్స్ గుర్ఖా సెకండ్ జనరేషన్ మోడల్ ఎస్‌యూవీ ఆటో ఎక్స్‌పో 2020లో ప్రవేశపెట్టిన ఫోటోలగే కనిపిస్తుంది. ఫోర్స్ గూర్ఖా  తాజా ఫోటోలో కనిపించే మోడల్ ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టిన వెర్షన్ అదే డిజైన్, స్టైలింగ్‌ని పొందింది. ఆటో ఎక్స్‌పోలో ప్రవేశపెట్టిన గూర్ఖా తరహాలో ఫెండర్-మౌంటెడ్ ఇండికేటర్లు, రౌండ్  ఎల్‌ఈ‌డి డి‌ఆర్‌ఎల్ లు, సింగిల్ స్లాట్ గ్రిల్, ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్ అలాగే రూఫ్ మౌంటెడ్ లగేజ్ క్యారియర్‌ను పొందుతుంది. కొత్త గూర్ఖా BS6 ఎస్‌యూ‌వి సింగిల్ స్లాట్ గ్రిల్ మధ్యలో కంపెనీ లోగోతో పాటు గుండ్రటి డే లైట్ రన్నింగ్ లైట్‌లతో కొత్త హెడ్‌ల్యాంప్‌ను పొందుతుంది. దీనితో పాటు ఆకర్షణీయమైన ఫాగ్ లైట్లు, వీల్ క్లాడింగ్ అండ్ బ్లాక్ ఓ‌ఆర్‌వి‌ఎంతో రూఫ్ క్యారియర్‌ను పొందుతుంది, ఇంకా పాత మోడల్ కంటే మరింత విలాసవంతమైన రూపాన్ని ఇస్తుంది. 

శక్తివంతమైన ఫీచర్లు

గుర్ఖా ఎస్‌యూవీ లీకైన ఫోటోలలో నారింజ రంగులో కనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో కూడా కంపెనీ అదే రంగులో దీనిని ప్రవేశపెట్టింది. కంపెనీ డబుల్ హైడ్రాలిక్ స్ప్రింగ్ కాయిల్ సస్పెన్షన్, 17-అంగుళాల ట్యూబ్ లెస్ టైర్లను ఇచ్చింది. అవి పెద్ద ట్రక్కు టైర్లుగా కనిపిస్తాయి. కారు చుట్టూ ఆఫ్-రోడ్ ల్యాండింగ్ ఉంటుంది. ఈ కారులో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రెండు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏ‌బి‌ఎస్, బ్యాక్ పార్కింగ్ సెన్సార్లు, పవర్ విండో డి‌ఆర్‌ఎల్ లతో ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లను పొందుతుంది. అలాగే  మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో కొత్త చాసిస్ కూడా పొందుతుంది.  

భద్రతా ఫీచర్లు

ఈ ఎస్‌యూ‌వి భద్రతా ఫీచర్ల పరంగా చాలా గొప్ప ఫీచర్లను పొందింది. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏ‌బి‌ఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈ‌బి‌డి), డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఈ ఎస్‌యూ‌విలో ఇచ్చారు.మహీంద్రా  కొత్త జనరేషన్ థార్‌ను రోడ్డు ఫ్రెండ్లీ వాహనంగా అందిస్తుంది.  

కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా లాంచ్ సమయంలో దాని ధర ఎలా ప్రకటించనున్నారు. కానీ మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ కొత్త గుర్ఖా BS6 ఎస్‌యూ‌విని రూ .10 నుండి 15 లక్షల మధ్య లాంచ్ చేయవచ్చు.

click me!